ప్రభాస్ కోసం బడ్జెట్ హీరోయిన్లు

ప్రభాస్ తో డైరక్టర్ మారుతి సినిమా అనగానే ఫ్యాన్స్ లో విపరీతమైన సంచలనం. ఆ సంచలనానికి సవాలక్ష కారణాలు వున్నాయి. వాటి సంగతి అలా వుంచితే ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుంటారనే వార్తలు…

ప్రభాస్ తో డైరక్టర్ మారుతి సినిమా అనగానే ఫ్యాన్స్ లో విపరీతమైన సంచలనం. ఆ సంచలనానికి సవాలక్ష కారణాలు వున్నాయి. వాటి సంగతి అలా వుంచితే ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుంటారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ ముగ్గురు హీరోయిన్ల ఎవరు అన్నది చర్చగా మారింది.

శ్రీలీల ఒక హీరోయిన్ అని టాక్ వచ్చింది. మాళవిక మోహనన్ అంటూ మరో పేరు బయటకు వచ్చింది. ఈ పేర్లు అన్నీ భలే చిత్రంగా వున్నాయని ఫ్యాన్స్ గోలపెడుతున్నారు. ప్రభాస్ సరసన ఈ చిన్న చిన్న హీరోయిన్లు ఏమిటా? అని కామెంట్లు విసురుతున్నారు. 

మారుతి సినిమాను బడ్జెట్ లో లాగించేలనుకుంటున్నారని, తక్కువ ఖర్చుతో ప్రభాస్ తో సినిమా చేసేయాలనుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాళవిక మోహనన్,  శ్రీలీల లాంటి చిన్న హీరోయిన్లతో పాన్ ఇండియా సినిమా తీసి ఏం చేద్దామనుకుంటున్నారని ఫ్యాన్స్ గోల మొదలైంది. 

అసలు మారుతికి అవకాశం ఇవ్వడమే ఫ్యాన్స్ కు వన్ పర్సంట్ కూడా నచ్చలేదు. ఇప్పడు ఈ హీరోయిన్ల పేర్లు వింటుంటే ఆ బాధ, గోల మరీ ఎక్కువైంది.