భీమ్లా చాలదు..బంగార్రాజు కూడా

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల తకరారు ఇంకా కొనసాగుతోంది. ఎలాగైనా భీమ్లా నాయక్ సినిమా విడుదలను వాయిదా వేయించాలని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ అపాయింట్…

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల తకరారు ఇంకా కొనసాగుతోంది. ఎలాగైనా భీమ్లా నాయక్ సినిమా విడుదలను వాయిదా వేయించాలని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నారు.

భీమ్లానాయక్ వాయిదా అన్నది నిర్మాతల చేతిలో లేదు. అది హీరో పవన్ కళ్యాణ్ చేతిలోనే వుంది. అయితే దిల్ రాజు వగైరా అక్కడితో ఆగడం లేదు. నాగార్ఙున బంగార్రాజు సినిమాను కూడా వాయిదా వేయించాలని చూస్తున్నారు. భీమ్లానాయక్ ఒక్కటీ వాయిదా వేస్తే బాగోదని, బంగార్రాజు కూడా వేస్తే బెటర్ అని లాజిక్ లు లాగుతున్నారు.

నిజానికి ఆర్ఆర్ఆర్ 7న విడుదలవుతుంది. రాధేశ్యామ్ 15న విడుదలవుతుంది. అందువల్ల భీమ్లా నాయక్ కాకపోయినా బంగార్రాజు లాంటి మీడియం సినిమాకు చాన్స్ వుంటుంది. అయినా కూడా రాధేశ్యామ్ ను దృష్టిలో వుంచుకుని ప్రయత్నాలు చేస్తున్నారు.

పరిస్థితి చూస్తుంటే భీమ్లా నాయక్ వెనక్కు వెళ్లేలాగే కనిపిస్తోంది. ఈ మేరకు టాలీవుడ్ లో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.