భీమ్లా ఊపు మామూలుగా లేదుగా

ఒక్కసారిగా భీమ్లా నాయక్ హడావుడి మళ్లీ మొదలైంది. ఈ నెల 25న విడుదల అని నిర్మాత నాగవంశీ బయ్యర్లకు సమాచారం అందించారు. ఆంధ్రలో టికెట్ రేట్లు లేవు కనుక 40 కోట్ల రేంజ్ లో…

ఒక్కసారిగా భీమ్లా నాయక్ హడావుడి మళ్లీ మొదలైంది. ఈ నెల 25న విడుదల అని నిర్మాత నాగవంశీ బయ్యర్లకు సమాచారం అందించారు. ఆంధ్రలో టికెట్ రేట్లు లేవు కనుక 40 కోట్ల రేంజ్ లో ఇచ్చేయాలని అనుకున్నారు. 

టికెట్ రేట్లు లేకున్నా ఒకె. ఫుల్ ఆక్యుపెన్సీ, సెకెండ్ షో వుంటే చాలని అంటూ బయ్యర్లు వెంట పడడం ప్రారంభమైంది. నిజానికి రెగ్యులర్ బయ్యర్లు వున్నారు. వారిని కాదని వేరే వారికి ఇవ్వడం అన్నది జరగదు. 

అయినా పోటా పోటీ ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. ఆంధ్రలో అంతా ఫిక్స్ డ్, రెగ్యులర్ బయ్యర్లకే భీమ్లాను ఇస్తున్నారు. నైజాం దిల్ రాజు చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే విడుదల అన్నది తేలే వరకు నాన్ థియేటర్ హక్కులు పూర్తి సైన్ చేయడం అన్నది ఆపేసారు. లవ్ స్టోరీ, పుష్ప లాంటి సినిమాల అనుభవం చూసి ఇప్పుడు పెద్ద సినిమాలకు ఇలాగే చేస్తున్నారు.

తొందరపడి శాటిలైట్, డిజిటల్ అమ్మేసి ఇబ్బంది పడే ఆలోచన పెద్ద సినిమాలు చేయడం లేదు. అలాగే హిందీ డబ్బింగ్ కూడా. ఇప్పుడు భీమ్లాకు వస్తున్న డిమాండ్, హడావుడి వల్ల నాన్ థియేటర్ హక్కులు కూడా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.