భీమ్లా నాయక్…ఉత్తరాంధ్ర తకరారు

భీమ్లా నాయక్ సినిమాకు బజ్ మామూలుగా లేదు. దీంతో ఆ సినిమా హక్కుల కోసం పోటీ మొదలైంది. కానీ హారిక హాసిని, సితార సంస్థలకు పర్మనెంట్ బయ్యర్లు వున్నారు. ఆ సెటప్ తోనే వెళ్తారు. …

భీమ్లా నాయక్ సినిమాకు బజ్ మామూలుగా లేదు. దీంతో ఆ సినిమా హక్కుల కోసం పోటీ మొదలైంది. కానీ హారిక హాసిని, సితార సంస్థలకు పర్మనెంట్ బయ్యర్లు వున్నారు. ఆ సెటప్ తోనే వెళ్తారు. 

అదే విధంగా ఉత్తరాంధ్ర ఏరియా హక్కులను పూర్వీ పిక్చర్స్ వీరునాయుడుకు ఇచ్చారు. కానీ ఎలాగైనా ఉత్తరాంధ్ర హక్కులు తీసుకోవాలని దిల్ రాజు-శిరీష్ పంతంగా వున్నారు. పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. నిర్మాత నాగవంశీని ఈ విషయంలో బెండ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

కానీ భీమ్లా హక్కులు మీవే అని పూర్వీ వీరునాయకుడు నాగవంశీ ఏనాడో మాట ఇచ్చారు. ఇప్పుడు మాట తప్పుతారా? అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఏరియాలో పూర్వీ వీరు నాయడు థియేటర్ల అగ్రిమెంట్లు ప్రారంభించారు. అయితే పోటీగా దిల్ రాజు-శిరీష్ కూడా అగ్రిమెంట్ల ప్రారంభించారు.

నిజానికి ఇక్కడ తప్పు నిర్మాత నాగవంశీ దే. క్లారిటీగా ఏ విషయం చెప్పేస్తే ఈ అయోమయం వుండదు. కానీ అలా చెప్పినట్లు కనిపించడం లేదు. అందుకే ఈ అయోమయ పరిస్థితి ఏర్పడింది.