భీమ్లా..రెండో ట్రయిలర్ అదుర్స్

తప్పు తెలుసుకోవడం కన్నా గొప్ప విషయం మరొకటి లేదు. భీమ్లా నాయక్ ట్రయిలర్ కట్ విషయంలో తప్పు ఙరిగింది. సరైన ఇంపాక్ట్ ను ఆ ట్రయిలర్ కలిగించలేపోయింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.…

తప్పు తెలుసుకోవడం కన్నా గొప్ప విషయం మరొకటి లేదు. భీమ్లా నాయక్ ట్రయిలర్ కట్ విషయంలో తప్పు ఙరిగింది. సరైన ఇంపాక్ట్ ను ఆ ట్రయిలర్ కలిగించలేపోయింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ఇప్పుడు రెండో ట్రయిలర్ ను అర్ఙెంట్ గా వదిలారు. 

బేసిక్ గా భీమ్లా నాయక్ డైలాగుల మీద, ఎమోషన్ల మీద ఆధారపడిన కల్ట్ సినిమా. మలయాళ మాతృకను తీసుకుని కమర్షియల్ టచ్ ఇస్తూ తయారుచేసిన సినిమా ఇది. ఆ ఫీల్ ను తొలి ట్రయిలర్ కలిగించలేకపోయింది. 

ఏదో లౌడ్ గా కట్ చేసినట్లుంది తప్ప లైను లెంగ్తూ కనిపించలేదు. దీనికి తోడు మిక్సింగ్ విషయంలో కూడా నెగిటివ్ రిమార్కులు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో రెండో ట్రయిలర్ వదిలారు. తొలి ట్రయిలర్ లో సీన్లు రిపీట్ వున్నా, ఈ ఆర్డర్ వేరుగా వుంది. కొన్ని సంభాషణలు జ‌త పడ్డాయి.అలాగే సన్నివేశాల ఆర్డర్ మారింది.

మొత్తం మీద ఈసారి ట్రయిలరకు ఓ లైనూ లెంగ్తూ, వర్తూ వచ్చాయి. ఇక సినిమా విడుదలకు జ‌స్ట్ రెండు రోజులు మాత్రమే వుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఫీవర్ అలుముకుంది. జోరుగా అడ్వాన్స్ బుకింగ్ లు సాగుతున్నాయి. దాదాపు తొలి రోజు బుకింగ్ లు అన్నీ ఫుల్ అయిపోయాయి.