భోళా.. ఓపెనింగ్స్ ఓకే.. టాక్ నాట్ ఓకే

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా. చిరంజీవి హీరో. మిల్కీబ్యూటీ హీరోయిన్. భారీ ప్రచారం… వెరసి భోళాశంకర్ పై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమాకు మంచి…

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా. చిరంజీవి హీరో. మిల్కీబ్యూటీ హీరోయిన్. భారీ ప్రచారం… వెరసి భోళాశంకర్ పై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు భోళాకు ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

మెహర్ రమేష్ డైరక్షన్ లో వచ్చిన భోళాశంకర్ సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. సినిమా కథ రొటీన్ గా ఉందని, టేకింగ్ బాగాలేదని పెదవి విరుస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో, రేపట్నుంచి ఈ సినిమాకు వసూళ్లు ఎలా ఉంటాయనేది పెద్ద ప్రశ్న.

అయితే ట్రేడ్ అంచనా ప్రకారం, ఈరోజు, రేపు ఈ సినిమా వసూళ్లు బాగుండే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఈ సినిమా రన్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ట్రేడ్ కూడా అంచనా వేయలేకపోతోంది. ఎందుకుంటే, నెగెటివ్ టాక్ ఆ రేంజ్ లో ఉంది మరి.

అటు ఓవర్సీస్ లో కూడా భోళా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు కేవలం 3 లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయి. వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ తో పోల్చిచూస్తే, భోళా వసూళ్లు సగానికి సగం తగ్గిపోయాయి. ప్రస్తుతం నడుస్తున్న టాక్, ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.. ఫైనల్ రన్ ముగిసేనాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా చేరేది అనుమానంగానే ఉంది.