Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా అప్ డేట్.. చిరు సినిమాకు కొత్త డేట్

మెగా అప్ డేట్.. చిరు సినిమాకు కొత్త డేట్

"ఈ తెలుగు నూతన సంవత్సరం, మెగా అప్ డేట్ తో కాస్త ముందుగానే మొదలైంది" అంటూ భోళాశంకర్ యూనిట్ క్రేజీ ప్రకటనతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమాను వరల్డ్ వైడ్ ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఎనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. సోఫాలో ఓవైపు కీర్తిసురేష్, మరోవైపు తమన్న కూర్చోగా.. సోఫా వెనక చిరంజీవి క్యాజువల్ గా నిల్చున్న స్టిల్ ను విడుదల చేశారు.

బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి-కీర్తిసురేష్ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరు సరసన హీరోయిన్ గా తమన్న నటిస్తోంది. చిరు-కీర్తిది ఫ్రెష్ కాంబో కాగా.. చిరు-తమన్న గతంలో సైరా సినిమాలో నటించారు.

నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు గతంలో ప్రకటన కూడా రిలీజ్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. అలా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఆగస్ట్ 11కు షెడ్యూల్ అయింది.

మరోవైపు మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాను ఆగస్ట్ రెండో వారంలో రిలీజ్ చేస్తారంటూ మొన్నటివరకు ప్రచారం నడించింది. తాజాగా చిరంజీవి సినిమాకు ఆగస్ట్ 11ను లాక్ చేయడంతో, మహేష్ మూవీ ఆ తేదీకి రాదనే విషయం స్పష్టమైంది.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా