Advertisement

Advertisement


Home > Movies - Movie News

కనీసం ఈసారైనా మాళవిక మాటలు నమ్మొచ్చా..!

కనీసం ఈసారైనా మాళవిక మాటలు నమ్మొచ్చా..!

క్లారిటీ ఇవ్వడంతో మాళవిక మోహనన్ ఎప్పుడూ ముందుంటుంది. తనపై ఎప్పుడు ఎలాంటి పుకార్లు వచ్చినా స్పందించడం ఆమె నైజం. అయితే ఆ స్పందనలో కాస్త నిజం, ఇంకాస్త అబద్ధం ఉండడం విశేషం. కాస్త వెనక్కు వెళ్దాం..

తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించడం తన డ్రీమ్ అంటూ ప్రకటించుకుంది మాళవిక మోహనన్. పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ, సరసన నటించాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కోరిక కోరింది.

మాళవిక కోరికను విజయ్ మన్నించాడు. ఆమెకు అవకాశం ఇచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఆమె అప్పట్లో ఖండించింది. విజయ్ సినిమాలో తానింకా కన్ ఫర్మ్ కాలేదంటూ బుకాయించింది. కట్ చేస్తే, ఆ తర్వాత అతడితో కలిసి సెట్స్ పైకి వెళ్లింది.

ఇప్పుడు మరోసారి తనపై వచ్చిన పుకారుపై స్పందించింది ఈ చిన్నది. పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాళవికను హీరోయిన్ గా తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇలా ఊహాగానాలు మొదలైన వెంటనే అలా రియాక్ట్ అయింది మాళవిక.

పవన్ అంటే తనకు చాలా ఇష్టమని, అయితే ప్రస్తుతానికి పవన్ నటిస్తున్న ఏ సినిమాలో తను భాగం కానని ప్రకటించింది. ఈ ప్రకటనను కొంతమంది నమ్ముతున్నారు, మరికొంతమంది ఖండిస్తున్నారు. ఇప్పుడిలానే అంటుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు, ఆమె గురించి తెలిసినవాళ్లు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్-మారుతి సినిమాలో నటిస్తోంది. ఆ సినిమానే తనకు తొలి తెలుగు సినిమా అని ప్రకటించిన మాళవిక, అందులో తనది సెకెండ్ లీడ్ కాదని, మెయిన్ హీరోయిన్ పాత్ర అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది. 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా