పండగ సినిమాల సందడితో ఈ ఏడాది బాక్సాఫీసు జోరుగా మొదలైయింది. ఇప్పుడా జోరు ఫిబ్రవరిలో కూడా కనిపిస్తోంది. ఫిబ్రవరి మొత్తంలో దాదాపు పది సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. ఇప్పుడీ వరుసలో మరో ఇంట్రస్టింగ్ సినిమా చేరింది. అదే.. శివ కందుకూరి 'భూతద్ధం భాస్కర్ నారాయణ'.
చూసి చూడంగానే, గమనం, మను చరిత్ర లాంటి చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు ని తెచ్చుకున్నాడు శివ. ఇప్పుడు డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ 'భూతద్ధం భాస్కర్ నారాయణ' తో వస్తున్నాడు. పురుషోత్తం రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటివరకు బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామెసింగా వుంది. ముఖ్యంగా ఆ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచింది.
శ్రీచరణ్ పాకాల, బేబీ ఫేం విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంయక్త సంగీతం సమకూర్చడం విశేషం. ప్రమోషన్స్ కోసం విడుదల చేసిన ఓ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. డిటెక్టివ్ మిస్టరీకి మైథాలాజీ టచ్ ఇవ్వడం టీజర్ లో ఆసక్తిగా వుంది.