‘భూతద్దం’ ఆసక్తికరం

సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే ఒక్కటే మార్గం.. కంటెంట్ లో ఏదో కొత్త పాయింట్ వుండాలి. ట్రైలర్ లో ఆ పాయింట్ చూపించి ఆసక్తిని పెంచాలి. శివ కందుకూరి నటించిన 'భూతద్ధం భాస్కర్ నారాయణ'…

సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే ఒక్కటే మార్గం.. కంటెంట్ లో ఏదో కొత్త పాయింట్ వుండాలి. ట్రైలర్ లో ఆ పాయింట్ చూపించి ఆసక్తిని పెంచాలి. శివ కందుకూరి నటించిన 'భూతద్ధం భాస్కర్ నారాయణ' ట్రైలర్ లో అలాంటి ఓ కొత్త పాయింట్ కనిపిస్తోంది. ఇదొక డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్. యునిక్ పాయింట్ ఏమిటంటే.. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టారు.

'ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని కొన్ని దారుణ హత్యలు జరగడం, ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు చెప్పడం.. దాన్ని పరిశోధించడానికి లోకల్ డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ రంగంలోకి దిగడం, అంతుచిక్కని ఈ కేసులో నరబలి కోణం తెరపైకి రావడం, దానికి పురాణాలతో ముడిపెట్టడం.. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ని కట్ చేశారు.

దర్శకుడు పురుషోత్తం రాజ్ ఏదో విలక్షణమైన పాయింట్ ని పట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. ట్రైలర్ వరకూ కంటెంట్ లో కొత్తదనం కనిపించింది. సీరియల్ కిల్లర్ కేసు, దాని వెనుక వున్న కథని తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.