ఖుషి చిత్రంలో పవన్‌కల్యాణ్ సరసన అలవోకగా నటించి మంచి నటిగా కథానాయిక భూమిక పేరు తెచ్చుకున్నారు. ఆ ఒక్క సినిమాతోనే భూమికకు చాలా మంది అభిమానులుగా మారారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె టాలెంట్. ఆ తర్వాత మరో హిట్ సినిమాలో భూమికా చావ్లా నటించి అభిమానుల మనసు కొల్లగట్టారు. ఆ హిట్ సినిమానే మిస్సమ్మ.
హీరోయిన్‌గా రైజింగ్‌లో ఉన్నప్పుడే భూమిక పెళ్లి చేసుకున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన భూమిక, పెళ్లి తర్వాత సినిమాలకు వీడ్కోలు పలికారు. ఇటీవల ఆమె తన స్థాయిని బాలీవుడ్‌కు పెంచుకున్నారు. ధోని సినిమాలో నటించి జాతీయస్థాయి నటిగా పేరు తెచ్చుకున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్ర పోషించిన ఎంసీఏ చిత్రంలో నటించి మెప్పించారు. తనలో ఇంకా నటన బతికే ఉందని ఆమె నిరూపించుకున్నారు. ఆ తర్వాత మరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారామె. ఈ సారి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాలో ఆమె నటించారు. ఇవన్నీ ఇలా సాగుతుండగా, ఆమె వ్యక్తిగత విషయాలపై సినీ ఇండస్ట్రీలో చర్చ ప్రారంభమైంది.
భూమిక తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా, అది తన పర్సనల్ అని దాటవేశారు. ఇదిలా ఉండగా ఓ స్టార్ హీరో సినిమాలో తనకు నెగటీవ్ పాత్రలో నటించే అవకాశం దక్కిందని భూమిక చెప్పుకొచ్చారు. అంటే లేడీ విలన్‌గా అందాల తార భూమిక తెర ముందు కనిపించనున్నారన్న మాట. మరి ఖుషిలో ఓ ప్రియురాలిగా చూసిన అభిమానులు…. లేడీ విలన్‌గా తమ అభిమాన నటిని స్వీకరిస్తారో లేదో కాలమో జవాబు చెప్పాలి.