టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌బాస్ ఫేమ్‌

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌బాస్ సీజ‌న్‌-4 కంటెస్టెంట్ హారిక ఎంపిక‌య్యారు. దేత్త‌డి హారిక యూట్యూబ‌ర్‌గా పాపుల‌ర్ అయిన ఆ యువ‌తి రియాల్టీ షోలో అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ముక్కు సూటిత‌నం, అమాయ‌క‌త్వం ఆమె సొంతం. …

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌బాస్ సీజ‌న్‌-4 కంటెస్టెంట్ హారిక ఎంపిక‌య్యారు. దేత్త‌డి హారిక యూట్యూబ‌ర్‌గా పాపుల‌ర్ అయిన ఆ యువ‌తి రియాల్టీ షోలో అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ముక్కు సూటిత‌నం, అమాయ‌క‌త్వం ఆమె సొంతం. 

చిన్న‌పిల్ల‌లా హౌజ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా హారిక నిలిచారు. హౌజ్‌లో చిన్న‌పిల్ల‌గా అల్ల‌రి చేస్తూ, అంద‌ర్నీ ఆట ప‌ట్టిస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా హారిక నిలిచారు. 

హౌజ్‌లో ప‌లు సంద‌ర్భాల్లో త‌న వాద‌న‌ను గ‌ట్టిగా వినిపించ‌డంలో నిర్భ‌యంగా, నిర్మొహ‌మాటం లేకుండా నేరుగా మాట్లాడిన తీరే …ఆమెను మిగిలిన వారి కంటే ప్ర‌త్యేకంగా నిల‌పింది. తాజాగా హారిక‌కు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా అరుదైన గౌర‌వం ద‌క్కింది. 

తెలంగాణ టూరిజం కార్పొరేష‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా హారిక‌ను నియ‌మిస్తూ తెలంగాణ  టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల్‌ శ్రీనివాస్‌ గుప్తా  నియామక పత్రాన్ని అందించారు. త‌న పాపులారిటీతో తెలంగాణ టూరిజానికి మ‌రింత పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకొస్తే …అంత‌కంటే కావాల్సిందేముంది? 

జూ ఎన్టీఆర్ కి 1% రాజకీయ పరిజ్ఞానం ఉన్నా

ఈ సినిమా నా జీవితంలో ఒక ఆణిముత్యం