డిప్రెషన్ లో సరయు?

యూ ట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సరయు బిగ్ బాస్ ఎంట్రీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆమెను బిగ్ బాస్ గుర్తించడమే పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె యూ ట్యూబ్…

యూ ట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సరయు బిగ్ బాస్ ఎంట్రీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆమెను బిగ్ బాస్ గుర్తించడమే పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె యూ ట్యూబ్ లో చేసేవి ఇలాంటి అలాంటి వీడియోలు కాదు. ఫక్తు అడల్ట్ కంటెంట్ వీడియోలు. చాలా మందికి ఇదే ఆశ్చర్యం కలిగించింది.

అలాంటిది ఫస్ట్ వీక్ లోనే సరయు బయటకు వచ్చేసి ఇంకా ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఇది ఆమెకు కూడా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన బోల్డ్ స్టయిల్ తో కొన్నాళ్ల పాటు బిగ్ బాస్ లో వుంటాననుకున్న సరయు ఇట్టే బయటకు వచ్చేసింది. 

ఇది పెద్ద షాక్. పైగా బిగ్ బాస్ లో ఆమె చేసిన కంటెంట్ ఏదీ పెద్దగా బయటకు రాలేదని, బయటకు వచ్చిన తరువాత ఎపిసోడ్ లు చూస్తే తెలిసి మరింత షాక్ కు గురయిందని బోగట్టా.

దీంతో ఎవరితోనూ పెద్దగా మాట్లాడడానికి ఆమె ఇష్టపడడం లేదని సరయు సన్నిహిత వర్గాల బోగట్టా. అయితే వైల్ట్ కార్ట్ ఎంట్రీగా ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ సరయు బిగ్ బాస్ హవుస్ లోకి వెళ్తుందని కూడా ఆమె సన్నిహితులు అంచనా వేస్తున్నారు.