జానీ మాస్టర్‌కు భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

లైంగిక ఆరోపణలపై జైలు జీవితం అనుభవించి, బెయిల్‌ పై విడుదలైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రదానం…

లైంగిక ఆరోపణలపై జైలు జీవితం అనుభవించి, బెయిల్‌ పై విడుదలైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసిన నేషనల్ అవార్డును రద్దు చేసింది. ఈ ఘటనతో ఆయన సాధించిన కీర్తి అంతా వ్యర్థమైంది.

కెరీర్‌లో మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్, చెడు అలవాట్ల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో కూడా కొంత కాలం పాల్గొని ప్రత్యర్థి పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు, డ్యాన్సర్ల సంఘంలో వివాదాలు చిన్నగా అనిపించినా, తనను నమ్మి వచ్చిన మహిళపై అనుచితంగా ప్రవర్తించడంతో ఆయన పేరు మరింత దెబ్బతింది. పెళ్లి, పిల్లలు ఉన్నప్పటికీ మతం మార్పించి మరో వివాహానికి సిద్ధమయ్యారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో, నేషనల్ అవార్డు రద్దుతో టాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలలో కూడా జానీ మాస్టర్‌కు అవకాశాలు తగ్గిపోవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అవార్డు అందుకోవడం కోసం బెయిల్‌పై విడుదలైనప్పటికీ, అవార్డు ర‌ద్దు కావ‌డంతో బెయిల్ కూడా ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

11 Replies to “జానీ మాస్టర్‌కు భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!”

  1. for political news – we know you will add your own masala. But for these kind of news also – who is the writer for this article?? what the govt did is – temporarily stopped the award, govt did not cancel the award. writer who the article and the editor of this article cant even report plain simple news… grow up and report the fact correctly

    note that I am noway supporting jaani master, just mentioning what govt did

Comments are closed.