గేమ్ ఛేంజర్.. డిసెంబర్ విడుదల, విశ్వంభర జనవరి విడుదల, ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. నిర్మాత దిల్ రాజు పదే పదే చెబుతూనే వున్నారు డిసెంబర్ లో వస్తుందని. విశ్వంభర దర్శకుడు గట్టిగా ప్రకటించారు. అయినా ఇంకా ఎక్కడో అనుమానమే. గేమ్ ఛేంజర్ విడుదల డేట్ మీద అనుమానం తప్ప, సినిమా వస్తుందా రాదా అన్న దాని మీద అనుమానం లేదు. ఎందుకంటే దాదాపు వర్క్ అంతా పూర్తి అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ 20 నా? డిసెంబర్ 25 న? అన్నది ఒక క్వశ్చను.
కానీ ఇక్కడే మరో క్వశ్చను కూడా వుంది. జనవరి సంక్రాంతి పండగ టైమ్ కు విశ్వంభర రాదు అని బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ సంస్థలకు జనవరి స్లాట్ ఖాళీ లేకపోవడమే. ఓటీటీ అమ్మకాలు కాకుండా అంత భారీ సినిమా విడుదల అసాధ్యం. అన్ని ఓటీటీ సంస్థలతో నిర్మాతలు చర్చలు సాగిస్తున్నారు. అవి ఫలప్రదం కావాల్సి వుంది.
విశ్వంభర రాకపోతే గేమ్ ఛేంజర్ ను సంక్రాంతి బరిలోకి దింపితే.. అంతకన్నా లక్ మరోటి వుండదు. అంత పెద్ద సినిమాకు సంక్రాంతి డేట్ దొరికితే అదృష్టం. అది కూడా దాదాపు సోలోగా.
సోలోగా అని ఎందుకు అనడం అంటే ఇప్పటికి సంక్రాంతికి ఫిక్స్ అయినవి విశ్వంభర కాకుండా మరో రెండు సినిమాలు. ఒకటి ‘సంక్రాంతికి వస్తున్నాం’, రెండు బాలయ్య- బాబిల సినిమా. సంక్రాంతికి వస్తున్నాం సినిమా దిల్ రాజు దే. కావాలంటే మూడు రోజులు అటు ఇటుగా మార్చుకోగలరు. బాబీ- బాలయ్య సినిమా మేజర్ డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజు నే. అందువల్ల క్లాష్ లేకుండా డేట్ వేసుకునే అవకాశం వుంది.
అందుకే ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ కు డేట్ అనౌన్స్ చేయలేదు. కంటెంట్ వదులుతున్నారు. పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. సరే, ఇవన్నీ జరిగి డిసెంబర్ మూడో వారం డేట్ ఖాళీ అయితే దాని పరిస్థితి ఏమిటి? అందుకే నితిన్ తమ్ముడు రెడీ అవుతోంది అనే టాక్ వుంది. మాడ్ 2 సినిమాను కూడా రెడీ చేస్తున్నారు.
మొత్తం మీద డిసెంబర్-జనవరి సినిమాల డేట్ లు అన్నీ ఎప్పుడు కన్ ఫర్మ్ అవుతాయి అంటే విశ్వంభర ఓటీటీ ఓ కొలిక్కి వచ్చిన తరువాతే.
ఇవి ఎప్పుడు వచ్చినా మేం థియేటర్లో చూడం
pushpa 2?
Rendu movies hit avutundi
ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాళ్ళేదో అఛ్చాగా
#RT75
vc available 9380537747
Call boy works 9989793850