20 లక్షలు మిస్ చేసుకున్న వరుణ్ సందేశ్!

మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ మిగిలిన దశలో బిగ్  బాస్ నుంచి ఆసక్తిదాయకమైన ఆఫర్లు వచ్చాయి. వారు నలుగురిలో ఎవరో ఒకరే  విజేతగా మిగులుతారు. మిగిలిన ముగ్గురికి రిక్తహస్తమే! అయితే మధ్యేమార్గంగా బిగ్ బాస్ నుంచి…

మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ మిగిలిన దశలో బిగ్  బాస్ నుంచి ఆసక్తిదాయకమైన ఆఫర్లు వచ్చాయి. వారు నలుగురిలో ఎవరో ఒకరే  విజేతగా మిగులుతారు. మిగిలిన ముగ్గురికి రిక్తహస్తమే! అయితే మధ్యేమార్గంగా బిగ్ బాస్ నుంచి ఒక బంపర్ ఆఫర్. అదేమిటంటే.. బిగ్ బాస్ ఇచ్చే భారీ మొత్తాన్ని తీసుకుని బయటపడవచ్చు. విజేతగా నిలవడంతో సంబంధం లేకుండా.. వారికి డబ్బు దక్కుతుంది. అది కూడా మొదటి ఆఫర్ పది లక్షల రూపాయలు. బిగ్ బాస్ ఇచ్చే ఆ డబ్బును తీసుకుని మొహం వెనక్కు తిప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు. అదీ డీల్.

అక్కడ ఉన్న నలుగురికీ ఆ డీల్ వివరించారు. అయితే  డబ్బు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడానికి వారు నలుగురూ నిరాకరించారు. ఎలిమినేషన్ లిస్టుతో సంబంధం లేకుండా డబ్బు తీసుకుని తప్పుకోవడానికి నో చెప్పారు. ఆ నలుగురిలో ఒకరు విజేత అనేది స్పష్టం అవుతోంది. అయితే ఒకరే విజేత! 

మిగిలిన వారికి దక్కేది లేదు. అదే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ ను 20 లక్షల రూపాయలకు పెంచారు. ఆ డబ్బును తీసుకుని వెళ్లిపోవచ్చన్నారు. అయితే అప్పుడు కూడా ఆ నలుగురు ఒక్కరు కూడా అందుకు ముందుకు రాలేదు. దీంతో ఎలిమినేషన్ కవర్ ను ఓపెన్ చేశారు. అందులో వరుణ్ సందేశ్ పేరు వచ్చింది! బిగ్ బాస్ ఆఫర్ ను మిస్ అయినందుకు బాధ లేదని, డబ్బు తీసుకుని వెళ్లిపోయి ఉంటే ఇన్నాళ్లూ తనకు ఓటేసిన వారిని అవమానించినట్టే అయ్యేదని వరుణ్ సందేశ్ అన్నాడు!