పదేళ్ల కిందటి వరకూ కూడా… ఏదైనా సినిమాలో హీరోయిన్ బికినీలో కనిపిస్తోందంటే అదో సంచలనమే ఇండియన్ సినిమాలో! ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ బికినీ షో చేయబోతోందనేది ప్రత్యేక వార్తగా నిలిచేది సినిమా పేజీల్లో! పేరున్న తారామణులు బికినీలో కనిపిస్తున్నారంటే అదో చర్చనీయాంశమే! అంతకు ఐదేళ్ల ముందు అయితే.. హీరోయిన్ బికినీ షో అంటే ఆ సినిమాకు టికెట్లు ఎక్కువ తెగేవి!
ధూమ్ -2లో ఐశ్వర్యరాయ్, కంబక్త్ ఇష్క్ లో కరీనా కపూర్.. ఇలా మొదలుపెడితే మల్లీశ్వరిలో కత్రినాకైఫ్, ద్రోణలో ప్రియమణి.. వరకూ బికినీ షోలతో బాంబులు పేల్చిన వారే! మరి బికినీ షో కోసమే హీరోయిన్లను ప్రత్యేకంగా తెచ్చుకోవడం, వారికి భారీ పారితోషికాలు ఇవ్వడం అప్పుడు వార్తల్లోని అంశమే! మామూలుగా నటించడానికి అయితే ఒక రేటు, బికినీ అంటే మరో రేటు అన్నట్టుగా వార్తలు వచ్చేవి.
అప్పటికే సినిమాల్లో గ్లామర్ షో ఏ స్థాయికి చేరినప్పటికీ కనీసం 15 యేళ్ల కిందటి వరకూ కూడా బికినీ ధరించడం అంటే.. ప్రత్యేకమే. కట్ చేస్తే.. ఇప్పుడు హీరోయిన్లు ఫ్రీ షో వేసేస్తున్నారు. బికినీలతో రెచ్చిపోతూ ఉన్నారు. ఇంతకు మించి.. ఆకులు అడ్డం పెట్టుకుని అందాలను ఆరబోస్తున్న వారూ ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. అయితే.. బికినీలు ఇప్పుడు మరీ ఉచితం అయిపోయినట్టుగా ఉన్నాయి.
సినిమాల్లో కాదు, తమ సోషల్ మీడియా అకౌంట్లలోనే ఉచితంగా షో చేస్తున్నారు హీరోయిన్లు. చిన్నా పెద్ద తేడా లేదు. కోటి రూపాయలు ఇస్తే కానీ బికినీ ధరించరనే పరిస్థితి నుంచి ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయింది. దీనికి కారణాల్లో ఒకటి హీరోయిన్లు తమ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం!
ఒకరని కాదు.. కియరా అద్వానీ, ప్రియాంక చోప్రా, అలియా భట్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఇలియానా, సారా అలీఖాన్, మృణాల్ ఠాకూర్.. ఇలాంటి వారంతా వరస పెట్టి బికినీ ఫొటోలను పోస్టు చేస్తూనే ఉన్నారు. తద్వారా వీలైనంతగా ఫాలోయర్ల సంఖ్యను పెంచుకుని.. సోషల్ మీడియా మార్కెటింగ్ లో వీరు క్యాష్ చేసుకుంటున్నారు.