Advertisement

Advertisement


Home > Movies - Movie News

బింబిసారను దెబ్బ తీస్తున్న ఫ్యాన్స్

బింబిసారను దెబ్బ తీస్తున్న ఫ్యాన్స్

ఫ్యాన్స్ షోషల్ మీడియాలో ఎంత కొట్లాడుకున్నా, మంచి సినిమా వస్తే ఏ హీరోదైనా చూస్తారు. ఎందుకంటే బేసిక్ గా వాళ్లు సినిమా అభిమానులు. కానీ మరీ రెచ్చగొడితే మాత్రం పంతం పట్టినట్లు ఆ సినిమాకు దూరంగా వుండిపోతారు. ఇప్పుడు లేటెస్ట్ సినిమా బింబిసార విషయంలో అదే ఙరుగుతున్నట్లు వుంది. 

బింబిసారకు మంచి ఓపెనింగ్ వచ్చింది. మంచి కమర్షియల్ మూవీగా మిగులుతుందని అనుకున్నారు. ఇప్పుడు దానికి పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం దానిని కొంత దెబ్బతీసేలా కనిపిస్తోంది.

బింబిసార విడుదలయిన కొంత సేపటి నుంచే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. మామూలుగా వాళ్ల సినిమాను వాళ్లు ప్రమోట్ చేసుకుంటే ఓకె. కానీ అలా ఊరుకోలేదు. మెగాస్టార్ చిరంజీని టార్గెట్ చేసారు. లేటెస్ట్ మెగా మూవీ ఆచార్య తో బింబిసారను పోలుస్తూ కళ్యాణ్ రామ్ కు మెగాస్టార్ బిరుదు తగిలిస్తూ హల్ చల్ చేస్తున్నారు.

నిజానికి మెగాస్టార్ కెరీర్ గ్రాఫ్ తో పోల్చుకుంటే కళ్యాణ్ రామ్ ఎందుకో సరిపోడు. బింబిసార ముందు సినిమా ఎంత మంచి వాడవురా సంగతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరచిపోయినట్లున్నారు. రెండో రోజు బింబిసార కలెక్షన్లు బాగా తగ్గాయి. దీని వెనుక ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడి వుంది అని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. 

మెగా ఫ్యాన్స్, అలాగే చిరు సామాజిక వర్గం బలంగా తలచుకుంటే సినిమాను బాయ్ కాట్ చేయడం పెద్ద విషయం కాదు. అలా చేస్తే అనవసరంగా కళ్యాణ్ రామ్ కే నష్టం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది తెలుసుకుని వీలయినంత సైలంట్ గా వుండాలి. పూర్తి సక్సెస్ వచ్చిన తరువాత వారికి ఎంత కావాలంటే అంత హల్ చల్ చేయొచ్చు.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను