కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా వస్తోంది బింబిసార. తన సొంత బ్యానర్ పై భారీగా డబ్బులు పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నాడు కల్యాణ్ రామ్. సినిమా టీజర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. టీజర్ లోనే ఖర్చు మొత్తం కనిపిస్తోంది.
“త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం, బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం.” అనే ఒక్క డైలాగ్ తో ఈ సినిమా స్టోరీలైన్ ఏంటనేది చెప్పకనే చెప్పేశారు. తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు బింబిసారుడు ఎంత దూరమైనా వెళ్తాడని, నెత్తుటి ఏరులు పారించాడనే విషయాన్ని టీజర్ లో చెప్పారు.
ట్విస్ట్ ఏంటంటే.. చివర్లో అదే కల్యాణ్ రామ్ ను రాచరికం నుంచి నేటి మోడ్రన్ యుగంలోకి తీసుకొచ్చారు. సూట్ వేయించి మరీ ఫైట్ చేయించారు. ఈ రెండు పాత్రలకు లింక్ ఏంటనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ టీజర్ ను కట్ చేయడం బాగుంది.
రెండు వేరియేషన్స్ లో కల్యాణ్ రామ్ లుక్ బాగుంది. ఈ కథపై నమ్మకంతో తన మార్కెట్ పరిథిని మించి, దాదాపు 40శాతం అదనంగా ఖర్చు పెడుతున్నాడు కల్యాణ్ రామ్. ఇది పాన్ ఇండియన్ మూవీ అని కూడా ప్రకటించేశాడు.
క్యాథరీన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వశిష్ట్ దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.