Advertisement

Advertisement


Home > Movies - Movie News

బింబిసార… రేర్ ఫీట్

బింబిసార… రేర్ ఫీట్

చాలా కాలం తరవాత టాలీవుడ్ లో ఒక మంచి పరిణామం. ఓ సినిమా తొలి మూడు రోజుల్లో దాదాపు బ్రేక్ ఈవెన్ కు రావడం అన్నది. మీడియా సినిమా కావచ్చు. ఇటీవల కాలంలో మరే సినిమా సాధించని ఫీట్ ఇది. బింబిసార సినిమాకు తొలి మూడు రోజుల్లో బయ్యర్లు సేఫ్ కావడం, నిర్మాతకు ఓవర్ ఫ్లోస్ స్టార్ట్ కావడం అంటే చిన్న విషయం కాదు.

అందులోనూ దీని ముందు సినిమా హీరోకి డిజాస్టర్. డైరక్టర్ కు ఇదే తొలి సినిమా. అందుకే నిర్మాతలు సినిమాను దిల్ రాజు దగ్గర వుంచి, ఏం చేయాలనిపిస్తే అది చేయండి అంటూ బాధ్యత అప్పగించారు. ఆయన, శిరీష్ సినిమా చూసిన తరువాత నుంచి మౌత్ టాక్ మొదలయింది. చాలా అద్భుతంగా వుందని వాళ్లు ఇద్దరూ అడిగిన వారికి అడగని వారికి చెప్పడం ప్రారంభించారు. అంతే కాదు, తమ స్వంత సినిమాలు అన్నీ చేసే రెగ్యులర్ బయ్యర్లకు సినిమాను రీజ‌నబుల్ రేట్లకు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ల ప్రాతిపదికన అప్పగించారు.

సినిమా మార్నింగ్ షో నుంచే సర్రున లేచింది. మర్నాడు కాస్త డౌన్ అయినా, మంచి నెంబర్లే నమోదు చేస్తూ వచ్చింది. దాంతో బ్రేక్ ఈవెన్ సులువు అయింది. ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ తరువాత జ‌రిగిన సోషల్ మీడియా పరిణామాల్లో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ అటు ఇటు తలపడ్డారు. దీంతో అటు బాలకృష్ణ..ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కటిగా నందమూరి ఫ్యాన్స్ గా మారారు. అది కళ్యాణ్ రామ్ కు కూడా కలిసివచ్చింది.  

సినిమాకు ఓపెనింగ్, టాక్ తీసుకురావడానికి ఫ్యానిజం చాలా ఉపయోగపడింది. ఆ తరువాత కంటెంట్ కూడా జ‌నాలకు నచ్చింది. సినిమాను ముందుకు తీసుకెళ్లిపోయారు. దాంతో గత కొంత కాలంగా టాలీవుడ్ ను అయోమయానికి గురిచేస్తున్న థియేటర్ల అంశం మీద ఓ క్లారిటీ వచ్చేసింది. సరైన కంటెంట్ వుంటే చాలు జ‌నాలకు థియేటర్ కు వస్తారనే సింపుల్ క్లారిటీ వచ్చేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?