Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్వదేశీ హీరోలు.. విదేశాల్లో పెట్టుబడులు

స్వదేశీ హీరోలు.. విదేశాల్లో పెట్టుబడులు

డబ్బులెక్కువైతే మన హీరోలు ఏం చేస్తారో అందరికీ తెలిసిందే. హోటల్స్ పెడతారు. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మంచి ఇల్లు, కార్లు కొనుక్కుంటారు. ఇంకా ఎక్కువ డబ్బులంటే తామే సొంతంగా సినిమాలు నిర్మిస్తారు.

మరి బాలీవుడ్ నటీనటులైతే ఏం చేస్తారు? వాళ్లు ఏకంగా విదేశాల్లో విల్లాలు కొంటారు. సరదాగా షికారుకెళ్లినట్టు విదేశాలకు వెళ్లి, అక్కడున్న తమ సొంత బంగ్లాలో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వస్తారు.

శిల్పాషెట్టి: బాలీవుడ్ మాజీ హీరోయిన్, యోగా బ్యూటీ శిల్పాషెట్టికి ముంబయిలోనే కాదు, లండన్ లో కూడా బంగ్లాలున్నాయి. లండన్ లోని ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్, మేఫెయిర్ లో శిల్పాషెట్టికి నివాసాలున్నాయి. వీటిలో 7 బెడ్ రూమ్స్ తో ఉండే ఓ బంగ్లా పేరు రాజ్ మహల్. నిజంగా ఇది చూడ్డానికి రాజ్ మహల్ లానే ఉంటుంది.

అభిషేక్-ఐశ్వర్య: బాలీవుడ్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కు ముంబయిలో బ్యూటిఫుల్ విల్లా ఉంది. అయితే అంతకంటే అందమైన విల్లా ఒకటి వాళ్లకు దుబాయ్ లో ఉంది.

10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాలోకు అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటుంది ఈ జంట. ఈ విల్లా ఖరీదు అక్షరాలా 35 మిలియన్ అరబ్ ఎమిరేట్ దిరామ్స్. పక్కా ఇన్వెస్ట్ మెంట్ కు దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెబుతారు.

అక్షయ్ కుమార్: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు కెనడాలోని టొరంటోలో ఏకంగా ఓ కొండపై విలాసవంతమైన నివాసం ఉంది. ఇంకా చెప్పాలంటే ఒంటిమిట్ట బంగ్లా అంటాం కదా, ఆ టైపు అన్నమాట. 

ఇది మాత్రమే కాదు, అక్కడే మరికొన్ని విలాసవంతమైన బంగ్లాలు, అపార్ట్ మెంట్స్ కూడా అక్షయ్ కు ఉన్నాయట. అక్షయ్ కు కెనడా పౌరసత్వం కూడా ఉంది కాబట్టి.. ఎప్పటికప్పుడు తన కుటుంబంతో కలిసి అక్కడికివెళ్లి హాలీడే ఎంజాయ్ చేస్తుంటాడు.

ప్రియాంక చోప్రా: ఇక ప్రియాంక చోప్రా అయితే దాదాపు తన పెట్టుబడులన్నీ విదేశాల్లోనే పెట్టింది. లాస్ ఏంజెల్స్ లో ఈమెకు 20 మిలియన్ డాలర్ల ఖరీదైన భవంతి ఉంది. దీంతో పాటు ఆమెకు న్యూయార్క్ లో ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ కూడా ఉంది.

షారూక్ ఖాన్: కింగ్ ఖాన్ షారూక్ కైతే దుబాయ్ లో ఏకంగా లగ్జరీ ఫామ్ హౌజ్ ఉంది. ఆ ఫామ్ హౌజ్ లో ఓ ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. 

అది పూర్తిగా ఆ ఫామ్ హౌజ్ సొంతం అన్నమాట. 14వేల చదరపు అడుగుల ఈ ఫామ్ హౌజ్ లో విలాసవంతమైన బెడ్ రూమ్స్, బాత్ రూమ్స్ ఉన్నాయి. దీంతో పాటు లండన్ లోని పార్క్ లేన్ లో ఈ హీరోకు 20 మిలియన్ పౌండ్ల ఖరీదైన అపార్ట్ మెంట్ కూడా ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?