‘వకీలు’ ఫీజు 65 కోట్లు?

పవన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్. ఈ సినిమా విషయంలో ఇటు నిర్మాత దిల్ రాజు, అటు హీరో పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే భయంకరమైన లాభాలు కళ్ల చూసారు కనుక. …

పవన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్. ఈ సినిమా విషయంలో ఇటు నిర్మాత దిల్ రాజు, అటు హీరో పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే భయంకరమైన లాభాలు కళ్ల చూసారు కనుక. 

వకీల్ సాబ్ సినిమాకు 50 కోట్లు రెమ్యూనిరేషన్ ప్లస్ లాభాల్లో వాటా అనే విదంగా పవన్ తో మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అయితే విడుదలకు ముందు దాన్ని లాభాలతో సంబంధం లేకుండా 65 కోట్లు ఇవ్వడానికి సెటిల్ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

ఆ విధంగా వకీలు ఫీజు 65 కోట్లు అయింది. ప్రకాష్ రాజ్ కు ఈ సినిమాకు గాను కోటి రూపాయిలు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా.

సినిమాను థియేటర్ – నాన్ థియేటర్ అన్నీ కలిపి 150 కోట్లకు కాస్త అటుగానే మార్కెట్ చేసారు. 

డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వుంచుకున్న ఏరియాలు అలా వుంచితే నిర్మాతగా రికార్డుల్లో వ్యాపారం జరిగిపోయింది. పైగా ఆయన వుంచుకున్న ఏరియాలు కూడా రాసుకున్న అంకెల మేరకు కలెక్షన్లు రాబట్టేసాయి. అందువల్ల సమస్య లేదు.

నిర్మాతగా 50 కోట్లు మేరకు లాభం వచ్చిందని ట్రేడ్ వర్గాల బోగట్టా. దీంట్లో బోనీ కపూర్ షేర్ ఎంత? దిల్ రాజు షేర్ ఎంత అన్నది తెలియాల్సి వుంది.