ఇకపై అంతా ఈ హీరోను ఫాలో అవ్వాల్సిందే!

“మా సినిమా థియేటర్లలోనే చూడాలి. సిల్వర్ స్క్రీన్ కోసమే మేం సినిమా తీశాం. ఓటీటీలో పెట్టి చిన్న మొబైల్ లో చూడ్డానికి కాదు. మా సినిమా సౌండ్ సిస్టమ్ థియేటర్లలోనే  బాగుంటుంది” ఈ స్టేట్…

“మా సినిమా థియేటర్లలోనే చూడాలి. సిల్వర్ స్క్రీన్ కోసమే మేం సినిమా తీశాం. ఓటీటీలో పెట్టి చిన్న మొబైల్ లో చూడ్డానికి కాదు. మా సినిమా సౌండ్ సిస్టమ్ థియేటర్లలోనే  బాగుంటుంది” ఈ స్టేట్ మెంట్స్ అన్నీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా? మన తెలుగు హీరోలే మొన్నటివరకు ఈ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఓటీటీని కాదని థియేటర్లలో రిలీజ్ చేస్తూ, కవరింగ్ కోసం ఇలాంటి డైలాగ్స్ చాలా కొట్టారు.

ఇలాంటి వాళ్లందరికీ తిరుగులేని సమాధానం ఇవ్వబోతున్నాడు సల్మాన్ హీరో. అవును.. ఈ హీరో నటించిన తాజా చిత్రం ఇటు థియేటర్లతో పాటు అటు ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వబోతోంది. ఎవ్వరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూస్తారు. తమ సినిమా సిల్వర్ స్క్రీన్ కోసమే తీశామని సల్మాన్ చెప్పడం లేదు. ఎక్కడ లాభం ఉంటే అక్కడ రిలీజ్ చేస్తున్నాడంతే.

వచ్చేనెల 13న సల్మాన్ ఖాన్ నటించిన రాధే-యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో, దిశా పటానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఒకేసారి ఇటు ఓటీటీలో, అటు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఉన్న లాక్ డౌన్ నిబంధనలకు తగ్గట్టు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒకవేళ థియేటర్లు కూడా లాక్ డౌన్ లో ఉంటే ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఇదే విధంగా మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, యూరోప్ దేశాల్లో కూడా రిలీజ్ అవుతోంది. అందుబాటులో థియేటర్ ఉంటే అక్కడికి వెళ్లి చూస్తారు, ఇష్టం లేకపోతే ఓటీటీలో చూస్తారు.

జీ-ప్లెక్స్ లో పే పర్ వ్యూ పద్ధతి కింద ఈ సినిమాను పెడుతున్నారు. టిక్కెట్ రేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాను ఇలా ఒకేసారి అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సల్మాన్ వెంటనే అంగీకరించాడు. ఇక ఈ సినిమాను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడంతో పాటు.. నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కింద జీ స్టుడియోస్ సంస్థ 235 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం.