Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళిని రెచ్చగొడుతున్న కింగ్ పిన్

రాజమౌళిని రెచ్చగొడుతున్న కింగ్ పిన్

ఆంధ్రలో సినిమా టికెట్ రేట్లు ఫిక్స్ చేయడం అన్నది టాలీవుడ్ పెద్దలు చాలా మందికి మింగుడుపడడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. రాబోయే పెద్ద సినిమాలకు అయితే దిక్కు తోచడం లేదు. 

ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి ఏమిటి అన్నది క్వశ్చనుమార్కుగా వుంది. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ లో అన్ని తరహా సినిమా వ్యాపారాలు వున్న ఓ కింగ్ పిన్ దర్శకుడు రాజమౌళిని రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. 

గిల్డ్ జూమ్ మీటింగ్ లో తెలుగుదేశంతో గట్టి బంధాలు పెనవేసుకున్న ఆ కింగ్ పిన్ మాట్లాడుతూ, ఎవరి ప్రొడక్ట్ ఎంతకు అమ్మాలో అన్నది వారే నిర్ణయించుకుంటారని, ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో రాజమౌళి కొర్టుకు వెళితే బెటర్ అని ఆ పచ్చ చొక్కా బంధాల కింగ్ పిన్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరో నిర్మాత అనిల్ సుంకర మాత్రం అలా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం వుండదని వారించినట్లు తెలుస్తోంది. 

దాంతో ఆ డిస్కషన్ అక్కడితో జూమ్ మీటింగ్ లో ఆగిపోయి, వేరే విధమైన సమావేశాలకు దారి తీసిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?