బాలీవుడ్ లోకి వివి వినాయక్

తెలుగు సినిమాల్లో తనదంటూ ఓ ముద్రవేసిన మాస్ సినిమాలను అందించిన దర్శకుడు వివి వినాయక్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.  Advertisement రాజమౌళి ఎవర్ గ్రీన్ హిట్ సినిమా ఛత్రపతితో ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ…

తెలుగు సినిమాల్లో తనదంటూ ఓ ముద్రవేసిన మాస్ సినిమాలను అందించిన దర్శకుడు వివి వినాయక్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. 

రాజమౌళి ఎవర్ గ్రీన్ హిట్ సినిమా ఛత్రపతితో ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు అంతా రెడీ అయింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ నిర్మాతలు ఛత్రపతి సినిమాను రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముందు సాహో సుజిత్ ను అనుకున్నారు. 

కానీ ఆయన వేరే సినిమా మీద వుండడంతో కుదరలేదు. ఇలాంటి టైమ్ లో వివి వినాయక్ అయితే అన్ని విధాలా ఈ సబ్జెక్ట్ కు ఫిట్ అని ఫిక్స్ అయ్యారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను అల్లుడు శ్రీనుగా మార్చి తోలిసినిమా అందించింది వివి వినాయక్ నే. ఇప్పుడు అదే హీరోతో కలిసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు…

గ్రేటర్ గెలుపు ఎవరిది