Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీకి కళా కాంతులు దక్కేనా ?

టీడీపీకి కళా కాంతులు దక్కేనా ?

విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఇద్దరు ఉద్ధండుల మధ్య పోరుకు వేదికగా నిలుస్తోంది. మంత్రిగా ఉంటున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రెండు దశాబ్దాలుగా చీపురుపల్లిలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన నాలుగు ఎన్నిలలో పోటీ చేస్తే మూడు గెలిచారు. సుదీర్ఘకాలం పాటు మంత్రిగా పనిచేశారు.

చీపురుపల్లిలో ఈసారి కూడా తనదే విజయం అని బొత్స ధీమాగా ఉన్నారు. ఆయనకు అక్కడ అంతా అనుకూలమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశపడిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును చీపురుపల్లికి చంద్రబాబు షిఫ్ట్ చేశారు.

చివరి నిమిషంలో వచ్చిన ఆయన గెలిచి చూపిస్తాను అని అంటున్నారు. ఒకప్పుడు చీపురుపల్లి టీడీపీకి కంచుకోట కావచ్చు కానీ గడచిన రెండు దశాబ్దాల కాలంలో గెలిచింది మాత్రం ఒకే ఒకసారి. గత వైభవం అంతా రాజకీయంగా కరిగిపోతున్న వేళ కళా కాంతులు తెచ్చేందుకు కళా వెంకటరావుని తెచ్చారని అంటున్నారు.

ఆయనకు ఉన్న సమయం తక్కువ. అలకలు అసంతృప్తులను చల్లార్చుకుని చీపురుపల్లిలో టీడీపీ ఎగరవేస్తే టీడీపీతో  పాటు ఆయనకూ మంచి రోజులు వస్తాయని ఆశ. ఈసారి గెలిస్తే మంత్రి కావచ్చునని ఆయన ఆలోచన.అనుచరుల ధీమా.

చీపురుపల్లిలో గెలిస్తే మంత్రి అని కళా అనుచరులు ప్రచారం చేస్తున్నారు. బొత్స సిట్టింగ్ మినిస్టర్. మరోసారి వైసీపీ ఖాయంగా అధికారంలోకి వస్తుంది  కాబట్టి మంత్రి కావడం తధ్యమని ఆయన అనుచరులు కడు నమ్మకంగా చెబుతున్నారు. ఈ ఇద్దరు ధీటైన నేతల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంది.

ఇద్దరూ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం విశేషం. చీపురుపల్లిలో అత్యధిక శాతం ఆ సామాజిక వర్గమే ఉంది. ఈసారి కూడా వైసీపీదే విజయం అని అధికార పార్టీ అంటూంటే టీడీపీ విక్టరీ కొడుతుందని ఆ పార్టీ చెప్పుకుంటోంది. బొత్సకు ఉన్న రాజకీయ చాతుర్యం, నియోజకవర్గంతో ఉన్న బంధాలు ఆయననే మళ్ళీ ఎమ్మెల్యే చేస్తాయని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?