తుంటిమీద కొడితే పళ్లు రాలడం అంటే ఇదే. ఇక్కడ ప్రశాతంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు చేసుకుంటూ, భారీ రెమ్యూనిరేషన్ అందుకుంటున్న మహేష్ బాబు మీద మరెక్కడో తెలుగు రాష్ట్రాలకు అస్సలు సంబంధం లేకుండా సినిమాలు చేసుకునే బాలీవుడ్ నిర్మాతలు గుస్సా కావడం ఏమిటి? కానీ కారణం వుందీ అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
విషయం ఏమిటంటే, మహేష్ బాబు బిజినెస్ మార్కెట్ అంతా ఒకటికి రెండుసార్లు లెక్క పెడితే 150 కోట్లు దాటదు. కానీ ఆయన రెమ్యూనిరేషన్ మాత్రం అందులో మూడో వంతు. అంటే యాభై కోట్లు దాటేసింది. సరే, నిర్మాతలు ఇస్తున్నారు, ఆయన తీసుకుంటున్నారు. మధ్యలో వేరేవాళ్లకు ఎందుకు బాధ? అంటే, పాయింట్ వుందట.
బాలీవుడ్ హీరోల మార్కెట్ వేరుగా వుంటుంది. వరల్డ్ వైడ్ మార్కెట్ వాళ్లది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ వున్నమహేష్ కే 50 కోట్లు ఇస్తుంటే వరల్డ్ వైడ్ మార్కెట్ వున్న తమకు ఎంత ఇవ్వాలి? అన్నది అక్కడ హీరోల పాయింట్ అంట. ఇలా చేయడం వల్ల తాము కూడా హీరోల రెమ్యూనిరేషన్ లు పెంచేయడం, నిర్మాణంలో వాటా ఇవ్వడం లాంటివి చేయాల్సి వస్తోందని అక్కడి నిర్మాతలు గుస్సాయిస్తున్నారట. అదీ విషయం.