సీపీఎంది కార్మిక ప‌క్షం -సీపీఐది బాబు ప‌క్షం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వామ‌ప‌క్షాలైన సీపీఐ, సీపీఎంలు రెండు ప‌క్షాలుగా విడిపోయాయి. సీపీఎం కార్మిక, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన నిలిస్తే, సీపీఐ మాత్రం చంద్ర‌బాబు ప‌క్షాన నిలిచింది. కార్మిక పార్టీగా, మార్క్సిస్ట్ సిద్ధాంతం గురించి చెప్పుకునే సీపీఐ….ఏ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వామ‌ప‌క్షాలైన సీపీఐ, సీపీఎంలు రెండు ప‌క్షాలుగా విడిపోయాయి. సీపీఎం కార్మిక, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన నిలిస్తే, సీపీఐ మాత్రం చంద్ర‌బాబు ప‌క్షాన నిలిచింది. కార్మిక పార్టీగా, మార్క్సిస్ట్ సిద్ధాంతం గురించి చెప్పుకునే సీపీఐ….ఏ మాత్రం సిగ్గుప‌డ‌కుండా ఆచ‌ర‌ణ‌లో త‌మ‌ది చంద్ర‌బాబు సిద్ధాంత‌మ‌ని, క్యాపిట‌లిస్టుల కోసం ప‌నిచేస్తామంటోంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా అనేక ఉదంతాలు చెప్పుకోవ‌చ్చు.

మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు కొంగు ప‌ట్టుకుని తిరిగేందుకు సీపీఐ నాయ‌కులు నారాయ‌ణ‌, రామ‌కృష్ణ‌ల‌కు మంచి అవ‌కాశం దొరికిన‌ట్టైంది. కానీ సీపీఎం మాత్రం అలా చేయ‌లేదు. అమ‌రావ‌తి రాజ‌ధాని వాస్త‌వాలు తెలిసిన పార్టీగా ఆ ఉద్య‌మానికి ఎంత వ‌ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలో అంత వ‌ర‌కే ప‌రిమిత‌మై త‌మ నిబ‌ద్ధ‌త‌ను చాటుకొంది. అది కూడా టీడీపీతో సందంధం లేకుండా అమ‌రావ‌తి రైతుల ఆందోళ‌న‌ల‌కు సంఘీభావం ప్ర‌క‌టించింది. కానీ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఏకంగా చంద్ర‌బాబు వెంట ఊరూరూ తిరుగుతూ జోలె ప‌డుతున్నాడు. ఎవ‌రి కోసం…కేవ‌లం కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, క్యాపిట‌లిస్టుల కోసం అంటే అతిశ‌యోక్తి కాదు.

సీపీఐ ముసుగులో నారాయ‌ణ‌, రామ‌కృష్ణ‌లు చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నారు. కియాపై త‌ప్పుడు వార్త రాసినా వెంట‌నే స్పందించిన నారాయ‌ణ‌, రామ‌కృష్ణ….అదే ఐటీ సోదాల్లో రూ.2వేల కోట్ల‌కు సంబంధించి అక్ర‌మ లావాదేవీల వ్య‌వ‌హారంపై మాత్రం నోరు మెద‌ప‌లేదు. ఎందుకంటే ఇది చంద్ర‌బాబుకు సంబంధించిన వ్య‌వహారం కాబ‌ట్టి.

అలాగే ఈఎస్ఐలో భారీ స్కామ్ వెలికితీత‌లో సీపీఎం ప్ర‌ధాన పోషించింది. ఆ పార్టీ రాష్ట్రకార్య‌ద‌ర్శి మ‌ధు లేఖ‌ రాయడం వ‌ల్లే ఈ అవినీతి భాగోతం బ‌య‌ట‌ప‌డింది. దీనిపై విజ‌య‌వాడ‌లో ఈఎస్ఐ కార్యాల‌యం ఎదుట సీపీఎం ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అక్ర‌మార్కుల‌ను క‌ఠిన శిక్షించాల‌ని, వారి నుంచి ప్ర‌జాధ‌నాన్ని రిక‌వ‌రీ చేయాల‌ని సీపీఎం నాయ‌కులు డిమాండ్ చేశారు. అలాగే సోమ‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో ఈఎస్ఐ కార్యాలయాల ఎదుట ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు.

మ‌రి కార్మిక పార్టీగా చెప్పుకుంటున్న సీపీఐ ఏ మాత్రం స్పందించ‌లేదు. ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు దిగ‌డం కాదు క‌దా…క‌నీసం ప‌త్రికా ప్ర‌క‌ట‌న ఇచ్చేందుకు కూడా వాళ్లు ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ అవినీతిలో మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని స‌త్య‌నారాయ‌ణ పీక‌ల్లోతు కూరుకుపోవ‌డ‌మే. చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని సీపీఐ మౌనం పాటించింది. కార్మికులు, మార్క్సిజం కంటే త‌మ‌కు చంద్ర‌బాబు సిద్ధాంత‌మే గొప్ప‌ద‌ని ఆ పార్టీ నేత‌లు నారాయ‌ణ‌, రామ‌కృష్ణ ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. వీరిద్ద‌రి వ్య‌వ‌హారం సీపీఐలోనే మింగుడుప‌డ‌టం లేద‌ని స‌మాచారం.  

కమ్యూనిస్టు పార్టీలంటే గతంలో గౌరవం ఉండేదని.. నారాయణ, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చాకా ఆ పార్టీలపై గౌరవం పోయిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులు చదివే బదులు కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం లో చేరండని రామ‌కృష్ణ‌, నారాయ‌ణ‌ల‌పై ధ్వజమెత్తారు.  

నారాయణ, రామకృష్ణలకు టీడీపీ నుంచి డబ్బులు అందుతున్నాయని శ్రీ‌కాంత్‌రెడ్డి ఆరోపించారు.  ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి ఆరోపించిన‌ట్టుగా టీడీపీ నుంచి సీపీఐ నేత‌ల‌కు ఎలాంటి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు లేక‌పోతే ఆందోళ‌న‌లు చేయ‌డానికి వ‌చ్చిన ఇబ్బందులు ఏంటి?  కార్మికులకు జ‌రుగుతున్న అన్యాయంపై ప్ర‌శ్నించాల్సిన బాధ్య‌త సీపీఐకి లేదా?

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు