శ్రీదేవితో బోనీ కపూర్ దిగిన తొలి ఫొటో ఇదే

శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె భర్త బోనీ కపూర్ ఓ అరుదైన ఫొటోను షేర్ చేశారు. శ్రీదేవితో తొలిసారి దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు. 1984లో ఓ సినిమా సెట్స్ లో శ్రీదేవితో…

శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె భర్త బోనీ కపూర్ ఓ అరుదైన ఫొటోను షేర్ చేశారు. శ్రీదేవితో తొలిసారి దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు. 1984లో ఓ సినిమా సెట్స్ లో శ్రీదేవితో కలిసి బోనీకపూర్ దిగిన ఫొటో అది.

శ్రీదేవి లేని లోటును ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు బోనీ కపూర్. ఎప్పటికప్పుడు ఆమె జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ శ్రీదేవితో దిగిన ఫొటోతో పాటు.. ఆమెతో షేర్ చేసుకున్న ఓ మధుర జ్ఞాపకాన్ని కూడా పంచుకున్నారు. దీంతో పాటు.. దుబాయ్ లో శ్రీదేవి మరణించినప్పుడు ఆమె దిగిన చివరి ఫొటోను కూడా నెటిజన్లతో పంచుకున్నారు బోనీ.

2018 ఫిబ్రవరిలో ఓ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లారు శ్రీదేవి. 54 ఏళ్ల వయసులో అక్కడే ఆమె మరణించారు. ఈ విషయాన్ని తలుచుకున్న బోనీ, శ్రీదేవి తనను విడిచిపెట్టి ఐదేళ్లు అయినప్పటికీ, ఆమె జ్ఞాపకాలు తనను ముందుకు నడిపిస్తున్నాయని రాసుకొచ్చారు.

1996లో శ్రీదేవి-బోనీ పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది జాన్వి కపూర్ పుట్టింది. ఖుషీ కపూర్ 2000లో జన్మించింది. పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైంది శ్రీదేవి. ఆ తర్వాత కొన్నాళ్లకు రీఎంట్రీతో అదరగొట్టింది.

శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరిట ఈ ఏడాదిలోనే ఆమె జీవిత చరిత్రపై పుస్తకం రాబోతోంది. ఈ పుస్తకం ప్రచురణ హక్కులను వెస్ట్ ల్యాండ్ బుక్స్ కొనుగోలు చేసింది. శ్రీదేవి ఫ్యామిలీ ఫ్రెండ్ ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రచిస్తున్నారు. 

5 Replies to “శ్రీదేవితో బోనీ కపూర్ దిగిన తొలి ఫొటో ఇదే”

  1. ఇదే ఆఖరి ఫోటో అయ్యుంటే బాగుండేదేమో…

    ఆ పరిచయం అక్కడికే ఆగిపోయి ఉంటె ఆమె జీవితం వేరేగా ఉంది ఇప్పుడు బతికి ఉండేదేమో

      1. ఎందుకు అంత నీచపు రాతలు / అభాండాలు. ?

        అంత పెద్దావిడని (56 ఏళ్ళు) చంపితే ఎవరికి ఏమొస్తుంది ?

Comments are closed.