బోయపాటి కూడా బ్యానర్లు కలపాల్సిందే

దర్శకులకు డిమాండ్ పెరిగిపోతూ వుంటే, నిర్మాతలు వెంట పడుతూ వుంటే ఏం చేయాలి..రెండేసి బ్యానర్లు కలపాల్సిందే. దర్ళకుడు బోయపాటికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేలా వుంది.  Advertisement ప్రస్తుతం ఆయన రామ్ హీరోగా ఓ…

దర్శకులకు డిమాండ్ పెరిగిపోతూ వుంటే, నిర్మాతలు వెంట పడుతూ వుంటే ఏం చేయాలి..రెండేసి బ్యానర్లు కలపాల్సిందే. దర్ళకుడు బోయపాటికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేలా వుంది. 

ప్రస్తుతం ఆయన రామ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. దాని తరువాత బాలయ్య హీరోగా 14 రీల్స్ పతాకం మీద ఓ సినిమా చేయాలి. కానీ పాత కమిట్ మెంట్ ఒకటి తెరపైకి వస్తోంది. గీతా సంస్థలో ఓ సినిమా చేయాల్సి వుంది. గతంలో ఎప్పుడో అల్లు అరవింద్ బాహాటంగానే ప్రకటించారు. తరువాత సినిమా తమదే అని. ఆ తరువాత జనం ఆ సంగతే మరిచిపోయారు.

మరో పక్కన బోయపాటి దగ్గర మరో ఒకటో రెండో అడ్వాన్స్ లో, కమిట్ మెంట్ లో వున్నాయి. లేటెస్ట్ గా అల్లు అరవింద్ తాను బోయపాటితో టచ్ లోనే వున్నానని, ఇటీవలే ఆర్ ఎఫ్ సి లో కలిసా అని, తమ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు హీరోల పేర్లు పరిశీలిస్తున్నామని చెప్పేసారు. అంటే బాలయ్య సినిమా ముందో, వెనుకో ఈ సినిమా వుంటుందనుకోవాలేమో?

కానీ ఇలా ఒకదాని తరువాత ఒకటి అంటే అన్ని కమిట్ మెంట్ లు పూర్తి చేసేసరికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ఇలా కాకుండా వుండాలంటే బోయపాటి కూడా బ్యానర్లు కలపాల్సిందేనేమో? ఎలాగూ ఇప్పుడు సినిమాల బడ్జెట్ లు వందల కోట్లకు చేరిపోతున్నాయి. అలాంటపుడు రెండు మూడు బ్యానర్లు కలిస్తేనే బెటరేమో?