ప్రముఖ నటుడు బ్రహ్మాజీ డిప్రెషన్‌లో ఉన్నారు. మెంటల్‌గా లాక్‌డౌన్ అయ్యారు. సాయం కోసం వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని తనే ట్విటర్‌గా వెల్లడించడారు. బ్రహ్మాజీ మెంటల్ కండీషన్‌పై ఆందోళన చెందారా? అయ్యో…అని మనసులోనే సానుభూతి వ్యక్తం చేశారా? ఆ అవసరం ఆయనకు లేదు లెండి. కాకపోతే, సోనూసూద్ దాతృత్వానికి ఫిదా అయిన బ్రహ్మాజీ సరదాగా ఆయన్ని ఆట పట్టించేందుకు ఓ ట్వీట్ చేశారు.
సోనూసూద్ అంటే కరోనాకు ముందు, కరోనా తర్వాత అని చర్చించుకోవాలి. ఎందుకంటే కరోనాకు ముందు ఆయన కేవలం బాలీవుడ్ నటుడిగానే సుపరిచితం. కానీ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ దేశాన్ని కష్టకాలంలోకి నెట్టేస్తున్న క్రమంలో తన వంతు సాయం అందించేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు తమతమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ఆయన పెద్ద మనసుతో ముందుకు వచ్చి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. సోనూ అంటే రియల్ హీరో అంటూ వేనోళ్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొందరు కావాలనే తాము కష్టకాలంలో ఉన్నామని, సాయం అందించి ఆదుకోవాలని సోనూను మిస్‌గైడ్ చేసేవాళ్లూ లేకపోలేదు. అలాంటి సరదా ఎపిసోడ్‌కు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తెరలేపారు. తనకు సాయం కోరుతూ బ్రహ్మాజీ ఫన్నీ రిక్వెస్ట్ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రహ్మాజీ ట్వీట్ ఏంటో చూద్దాం.
‘డియర్ సూపర్‌మ్యాన్ సోనూ భాయ్.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. మెంటల్‌గా లాక్‌డౌన్ అయ్యాను. హైదరాబాద్‌లో చిక్కుకు పోయాను. ప్లీజ్ నన్ను క్రొయేషియా తీసుకెళ్లు’ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బ్రహ్మాజీ ట్వీట్‌పై సోనూ సూద్ స్పందన ఎలా ఉంటుందోననే ఉత్కంఠ చిత్ర పరిశ్రమలో నెలకొంది.