బ్రాండ్ అంబాసిడర్లు..జర జాగ్రత్త

హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుండడం కొత్త కాదు. అందుకోసం కోట్లకు కోట్లు పారితోషికం అందుకోవడమూ కొత్త కాదు. అయితే ఇలా బ్రాండింగ్ ఒప్పుకునే ముందు కాస్త ఆలోచించాలి.  Advertisement కన్సూమర్ ప్రొడెక్ట్స్ వరకు ఫరవాలేదు.…

హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుండడం కొత్త కాదు. అందుకోసం కోట్లకు కోట్లు పారితోషికం అందుకోవడమూ కొత్త కాదు. అయితే ఇలా బ్రాండింగ్ ఒప్పుకునే ముందు కాస్త ఆలోచించాలి. 

కన్సూమర్ ప్రొడెక్ట్స్ వరకు ఫరవాలేదు. అవి ఆరోగ్యానికి మంచివా కాదా అన్నది చూసుకుంటే చాలు. కానీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వుండే ముందు, అవి వుంటాయో? ఊడుతాయా? అన్నది చూసుకోవాలి. లేదూ అంటే ఆ మురికి సెలబ్రిటీలకు అంటుకుంటుంది.

ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలను అండార్స్ చేసేటపుడు లేదా రికమెండ్ చేసేటపుడు హీరోలు జాగ్రత్తగా వుండాలి. అవి ఎప్పుడు బిచాణా ఎత్తేస్తాయో ఎవరికీ తెలియవు. ఆ మధ్య సాహితీ అనే నిర్మాణ సంస్థ కుంభకోణం బయటపడింది. అంతకు ముందు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న రామకృష్ణ వెనిజులా అనే సంస్థ ఇలాగే మధ్యలో మాయమైంది. ఇప్పుడు లేటెస్ట్ గా సువర్ణభూమి.

రామకృష్ణ వెనిజుల సంస్థకు మహేష్ బాబు పేరుతో బోలెడు ప్రచారం జరిగింది. సువర్ణభూమికి గతంలో చాలా మంది పేర్లు వాడారు. లేటెస్ట్ గా రామ్ చరణ్ పేరు కూడా వాడేసారు. ఈ మధ్యనే బాలయ్య కూడా ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసారు. ప్రచారం ప్రారంభించారు. ఏమైనా ఇకపై ఇలాంటి వాటి విషయంలో హీరోలు జాగ్రత్తగా వుండాల్సి వస్తుందేమో?