Advertisement

Advertisement


Home > Movies - Movie News

బ్రేకింగ్..ప్రభాస్..-రాజా డీలక్స్

బ్రేకింగ్..ప్రభాస్..-రాజా డీలక్స్

బాహుబలి ప్రభాస్ మరో సినిమాకు సైన్ చేయబోతున్నారు. ఫ్యామిలీ డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో ఒక బ్యూటి ఫుల్ ఫ్యామిలీ సినిమా చేయబోతున్నారు. 

నిర్మాతగా డివివి దానయ్య, నిరంజన్ రెడ్డిలు వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ ఫైనల్ అనుమతి ఇవ్వాల్సి వుంది.

ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల నడుమ గ్యాప్ ల్లో ఈ సినిమాను ఫినిష్ చేయాలన్నది ఆలోచనగా తెలుస్తోంది. 'రాజా డీలక్స్' అనే డిఫరెంట్ టైటిల్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. సినిమా కలర్ ఫుల్ గా, ఫ్యామిలీ సబ్జెక్ట్ తో, అందమైన అమ్మాయిల కాంబినేషన్ లో వుండే అవకాశం వుంది. 

ప్రభాస్ మాంచి ఫ్యామిలీ సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ సినిమా ఓకె అయితే కనుక ఆ కొరత తీరుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?