బన్నీ-సుకుమార్ కాంబినేషన్ పుష్ప సినిమా షూటింగ్ అర్థాంతరంగా క్యాన్సిల్ అయింది. యూనిట్ లో డజను మంది వరకు కరోనా వచ్చినట్లు తెలుస్తోంది.
కరోనా కాదు కానీ వేరే సమస్యతో ఓ యూనిట్ మెంబర్ కు ప్రాణాలమీదకు వచ్చినట్లు టాక్. దీంతో అర్జెంట్ గా షూటింగ్ ను క్యాన్సిల్ చేసి యూనిట్ అంతా మారేడుమిల్లి నుంచి వెనక్కు వచ్చేసినట్లు తెలుస్తోంది.
హంగామానే హంగామా
నిజానికి కరోనా నేపథ్యంలో చాలా తక్కువ మందింతో షూటింగ్ చేయాల్సి వుంది. కానీ దాదాపు ఎనిమిది తొమ్మిది వందల మందితో షూట్ చేస్తున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతంలో ఇలాంటి అలాంటి హంగామా లేదు.
పుష్ప ఖర్చు రోజుకు నలభై లక్షలు? బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ఈస్ట్ గోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ షూటింగ్ ఇప్పుడు అక్కడ ఓ జాతర లెవెల్ లో జరుగుతోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అంటే రోజుకు షూటింగ్ లో కనీసం నాలుగు వందల మంది నుంచి అయిదు వందల మంది వుంటారు. నటించేవాళ్లు పట్టుమని పది మంది ఉండకపోయినా, ఈ పటాటోపం తప్పదు.
అయితే పుష్ప సినిమా షూట్ కోసం దాదాపు రోజుకు ఎనిమిది వందలకు పైగా సినిమా సిబ్బంది పని చేస్తున్నారట. షూటింగ్ స్పాట్ నుంచి కనీసం కిలోమీటర్ దూరం వరకు వాహనాలు ఆగి వుంటున్నాయట.
షూటింగ్ ఖర్చు రోజుకు నలభై నుంచి యాభై లక్షలు వుంటుందని ఇండస్ట్రీ జనాల అంచనా. పైగా ఇక్కడ ఓ షెడ్యూలు చేద్దాం అనుకున్న సుకుమార్, ఇక్కడ డీప్ ఫారెస్ట్ లుక్ చూసి, మరో షెడ్యూలు కూడా ఇక్కడే చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇలాంటి టైమ్ లో కరోనా కారణంగా ఇలా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.