పవన్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ స్క్రిప్ట్, మాటలతో వస్తున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 28న విడుదల కానున్న ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి.
రెండు గంటల 16 నిమిషాల నిడివి వచ్చింది. ఇందులొ స్టార్టింగ్, ఎండింగ్ టైటిల్స్ తీసేస్తే 2 గంటల 10 నిమిషాల వరకు వుంటుంది. చాలా పెర్ ఫెక్ట్ రన్ టైన్ అనే చెప్పుకోవాలి. సినిమాకు ఎటువంటి కట్స్ లేకుండా యు సర్టిఫికెటి ఇచ్చారు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తరవాత పవన్ వరుసగా చేస్తున్న మూడో రీమేక్ ఇది. తమిళ సినిమా లైన్ మాత్రం తీసుకుని, కథ మొత్తం మార్చి కొత్త సీన్లతో కొత్తగా చేసారు కథకుడు త్రివిక్రమ్. పవన్ ఫ్యాన్స్ కు ఎలా కావాలో అలా తొలిసగాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా మార్చారు. మలి సగం మాత్రం పూర్తిగా కథ మీద వుంటుందని తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా సంస్థ, జి స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. పవన్ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం.