బ్రో సినిమా ఓ కొలమానం అవుతుందా?

పీపుల్ మూడ్.. నేషన్ మూడ్ అనేవి కామన్. వాతావరణ సూచన మాదిరిగా వుంటాయి ఇవి కూడా. కార్తికేయ2 లాంటి సినిమా నార్త్ బెల్ట్ లో బ్లాక్ బస్టర్ కావడం, ఆదిపురుష్ సినిమాకు నేషనల్ వైడ్…

పీపుల్ మూడ్.. నేషన్ మూడ్ అనేవి కామన్. వాతావరణ సూచన మాదిరిగా వుంటాయి ఇవి కూడా. కార్తికేయ2 లాంటి సినిమా నార్త్ బెల్ట్ లో బ్లాక్ బస్టర్ కావడం, ఆదిపురుష్ సినిమాకు నేషనల్ వైడ్ గా భారీ బజ్ రావడం ఇవన్నీ దేశంలో పెరుగుతున్న హిందూత్వ మూడ్ కు సంకేతాలు.

2019 ఎన్నికల ముందు అజ్ఙాతవాసి దారుణమైన ఫ్లాప్ కావడం, మహానాయకుడు – కథనాయకుడు సినిమాలను పక్కన పెట్టడం అప్పటి మూడ్ స్వింగ్ కు ఉదాహరణలు. ఫ్లాప్ కావడం వేరు జనాలు మరీ దారుణంగా తిరస్కరించడం వేరు. అప్పుడు ఆ సినిమాల విషయంలో జరిగింది అదే. అప్పుడు జనాలు అంతా జగన్ నామ జపంతో ఊగిపోతున్నారు. ఆ మూడ్ లో, ఆ ఊపులో ఇవి పట్టక పక్కన పెట్టారు.

ఇప్పుడు ట్రెండ్ వేరుగా వుంది. ఆంధ్రలో జగన్ మీద నెగిటివిటీ ఏ మేరకు వుంది అనే పాయింట్ కన్నా, పవన్ మీద పాజిటివిటీ ఏ మేరకు వుంది అన్నది కీలకం. ఇప్పుడు పవన్ సభలు అంటే చాలు జనం ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఈస్ట్..వెస్ట్ పరిస్థితి ఎలా వుంటుందో ఇప్పటికే కనిపించింది. మిగిలిన చోట్ల కూడా ఇలాగే వుండే అవకాశం వుంది. ఈ జనాభిప్రాయం, ప్రేమ కచ్చితంగా సినిమా మీద కూడా చూపించాలి. ఎందుకు ఇలా అనడం అంటే…వస్తున్న బ్రో సినిమా మాస్ మసాలా కమర్షియల్ సినిమా కాదు. ఓ మెసేజ్ వున్న సినిమా. ఫ్యామిలీ సినిమా.

ఇలాంటి సినిమాను పవన్ ఫ్యాన్స్ తో పాటు జనం కూడా బాగా ఆదరిస్తే కచ్చితంగా ట్రెండ్ అర్థం అవుతుంది. సినిమా వేరు.. మీటింగ్ లు వేరు.. ఎన్నికలు వేరు అన్నది కొంత వరకు వాస్తవం కావచ్చు. కానీ జనం మూడ్ ను కొంతయినా ఇవి చూపిస్తాయి. అది ఇప్పుడు పక్కాగా చూడాల్సి వుంది. ఎందుకంటే అభిమానం అంటే…అంతకు..మించి అనే అనుకోవాలి ఎప్పుడూ.

తమిళ సూపర్ స్టార్ సినిమాల బయట చాలా సాదా సీదా గా వుంటారు. మేకప్ వేసుకోరు. విగ్ పెట్టుకోరు. కానీ జనం విరగబడి చూస్తారు. కలుస్తారు.. అభిమానిస్తారు. అందువల్ల బ్రో సినిమా కమర్షియల్ గా వున్నా, లేకున్నా, అభిమాన జనం వెళ్లి చూడాల్సిందే. అప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రలో పవన్ మీద వున్నది ఏ రేంజ్ అభిమానం అన్నది.