నో రీమేక్స్.. లిస్ట్ లోకి మరో హీరో

పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్.. ఈ హీరోలందరూ రీమేక్స్ ఇష్టపడతారు. ఇప్పటికే చాలా చేశారు కూడా. వీళ్లకు పూర్తి రివర్స్ లో ఉండే హీరోలు కూడా ఉన్నారు. ఉదాహరణకు మహేష్ బాబునే తీసుకుందాం. ఈ…

పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్.. ఈ హీరోలందరూ రీమేక్స్ ఇష్టపడతారు. ఇప్పటికే చాలా చేశారు కూడా. వీళ్లకు పూర్తి రివర్స్ లో ఉండే హీరోలు కూడా ఉన్నారు. ఉదాహరణకు మహేష్ బాబునే తీసుకుందాం. ఈ హీరో రీమేక్స్ చేయడానికి అస్సలు ఇష్టపడడు. ఇప్పుడు మహేష్ బాబు కోవలోకి మరో హీరో చేరాడు. అతడే సాయిధరమ్ తేజ్.

సాయితేజ్ కూడా రీమేక్స్ కు వ్యతిరేకం అంటున్నాడు. ఓవైపు తన కాంపౌండ్ లోనే చిరంజీవి, పవన్ లాంటి హీరోలు వరుసపెట్టి రీమేక్స్ చేస్తుంటే.. అదే కాంపౌండ్ కు చెందిన సాయితేజ్ ఇలా స్పందించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.

“నేను ఏ సినిమాను రీమేక్ చేయను. భవిష్యత్తులో రీమేక్స్ ఆలోచన కూడా చేయను. ఎందుకంటే, రీమేక్స్ చేయాలంటే ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్ కావాలి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమాలు రీమేక్ చేయాలనే ఆలోచన అస్సలు లేదు. ఆయన సినిమా రీమేక్ చేసి అంచనాలు అందుకోవడం చాలా కష్టం. ఓ పవన్ కల్యాణ్ అభిమానిగా నేను ఆ పని చేయలేను.”

ఇలా రీమేక్స్ కు తను వ్యతిరేకం అనే విషయాన్ని బయటపెట్టాడు సాయిధరమ్ తేజ్. బ్రో సినిమాలో తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన ఈ హీరో.. ఫ్యాన్స్ మరీ బలవంతం పెడితే, పవన్ కల్యాణ్ ఆదేశిస్తే, తొలిప్రేమ సినిమాను మాత్రం రీమేక్ చేస్తానని కొసమెరుపు ఇచ్చాడు.

మరికాసేపట్లో బ్రో మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. అయితే హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు, ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని.. ఫంక్షన్ ను కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేయబోతున్నారు. రాత్రి 8.30 తర్వాత ఈవెంట్ స్టార్ట్ అవుతుంది.