బ్రో..ఐ డోంట్ కేర్.…బాలయ్య

ఎఫ్ 3 సక్సెస్ తో హుషారు మీద వున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ ఉత్సాహంతోనే బాలకృష్ణ సినిమా మీదకు వెళ్లబోతున్నారు.  Advertisement సెప్టెంబర్ చివరి నుంచి బాలయ్య రెడీ. నాలుగు నెలల్లో షూట్…

ఎఫ్ 3 సక్సెస్ తో హుషారు మీద వున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ ఉత్సాహంతోనే బాలకృష్ణ సినిమా మీదకు వెళ్లబోతున్నారు. 

సెప్టెంబర్ చివరి నుంచి బాలయ్య రెడీ. నాలుగు నెలల్లో షూట్ కంప్లీట్ చేసి, ప్రీ సమ్మర్ లో విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసారు అనిల్ రావిపూడి.

‘..బ్రో..ఐ డోంట్ కేర్..’ అన్నది టైటిల్ అని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు, ఆటిట్యూడ్ కు ..ఐ డోంట్ కేర్..’ అనే టైటిల్ పక్కాగా సరిపోతుంది. 

కాంటెంపరరీగా, యూత్ ఫుల్ గా వుండాలి. దానికి ‘బ్రో’ యాడ్ చేసినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ..బ్రో..ఐ డోంట్ కేర్..’ అన్నది టైటిల్.

ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తోంది. బాలయ్య సరసన ఓ మాజీ హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మరొకటి రెండు ఆప్షన్లు పెట్టుకున్నారు. ఈ వారంలో అది కూడా ఫైనల్ చేస్తారు. 

పటాస్ మాదిరిగా మాంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. దీనికి నిర్మాత సాహు గారపాటి.