గీతా సంస్థకు టైమ్ బాగా లేదు. చావు కబురు చల్లగా మంచి సినిమానే కానీ ఆడలేదు. బ్యాచులర్ అలా అలా గట్టెక్కింది. హిందీలో జెర్సీ తీస్తే అది కూడా అంతే అయింది. గని సినిమా గట్టిగా దెబ్బేసింది.
ఇప్పుడు మరో సినిమా పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు రెడీ అయింది. అందుకే రిస్క్ చేయాలని అనుకోవడం లేదు అల్లు అరవింద్.
సాధారణంగా కొన్ని ఏరియాలు వుంచుకోవడం అన్నది గీతా సంస్థకు అలవాటు. కానీ ఈసారి అలా వుంచుకోదలుచుకోలేదు. ఆంధ్ర ఏరియాను పది కోట్ల రేషియో చెబుతున్నారు కానీ ఎనిమిది రేంజ్ లో ఇచ్చేయాలనుకుంటున్నారు. అదే విధంగా ఓవర్ సీస్ లో బయ్యర్ కోసం వెదుకులాట మొదలయింది. గోపీచంద్ సినిమా ఓవర్ సీస్ లో తీసుకునేవారు దొరకడం కాస్త కష్టమే.
దిల్ రాజు డిస్రిబ్యూట్ చేసే ఏరియాలు వుంటే స్వంతానికి వుంచుకుని అక్కడ వుంచడం అన్నది గీతాకు అలవాటు. కానీ ఈసారి రేటు వస్తే ఆ ఏరియాలు కూడా అమ్మేయాలనుకుంటున్నారు. మారుతి డైరక్షన్ లో తయారైన ఈ సినిమాకు కాస్త ఖర్చు ఎక్కువే అయిందని అల్లు అరవింద్ అంటున్నారు. కానీ మారుతి ఎక్కువ ఖర్చు పెట్టిస్తారా? అన్నది అనుమానం.
కేవలం థియేటర్ మీదనే దాదాపు ఇరవై నుంచి పాతిక కోట్లు రాబట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్ర కు ఎనిమిది నుంచి పది కోట్లు చెబుతున్నారు. ఓవర్ సీస్ కు రెండు కోట్లు అడుగుతున్నారు.