అల్లు శిరీష్ చాలా కాలం అయింది తెరమీద కనిపించి. అసలు ఆ మాటకు వస్తే టాలీవుడ్ లోనే కనిపించడం తగ్గించేసాడు. ముంబైలో ఎక్కువ వుంటున్నాడు. అలాంటి అల్లు శిరీష్ సినిమా వస్తోంది. ఇది కాస్త ఆశ్చర్యమే. ఉరుము లేని పిడుగులా వచ్చి పడుతోంది కదా. అంతా కలిపి ఓ నెల రోజులు అయి వుంటుంది. బడ్డీ సినిమా హడావుడి మొదలై. అల్లు శిరీష్-జ్ఞాన్ వేల్ రాజా కాంబినేషన్ అన్నప్పుడు మినిమమ్ వుండాలి. శిరీష్ కోసం అల్లు అరవింద్ లాంటి పెద్దలు రంగంలోకి దిగాలి. కానీ అలా జరగలేదు. జస్ట్ అలా వదిలేసారు.
సినిమా విడుదల కు ముందు ఓ మాంచి యాక్షన్ ట్రయిలర్ ను విడుదల చేసారు. నిజానికి ఈ సబ్డెక్ట్, ఈ సినిమా పిల్లలకు బాగా నచ్చే అవకాశం వుంది. కానీ ఆ దిశగా పబ్లిసిటీ జరగడం లేదు. విడుదల ముందు విడుదల చేసిన యాక్షన్ ట్రయిలర్ బాగానే వుంది. ఫుల్ యాక్షన్ కట్ అన్నది పిల్లలకు నచ్చేలా వుంది. టెడ్డీనే హీరోగా చూపించి, కట్ చేసిన తీరు బాగుంది. ట్రయిలర్ తొలిసగం టెడ్డీ మీద నడిపి, మలిసగంలో హీరోను తీసుకుచవ్చారు. కెప్టెన్ క్యారెక్టర్ లో శిరీష్ ఫిట్ గానే వున్నాడు.
అల్లు శిరీష్ బ్యాడ్ యాక్టర్ ఏమీ కాదు. ఒకటి రెండు తప్ప అతగాడి మిగిలిన సినిమాలు అన్నీ ఇంతో అంతో బాగానే వున్నాయి అనిపించుకున్నాయి. సరైన సబ్డెక్ట్ లు ఎన్నుకుని, బన్నీ తమ్ముడిని అన్నది మరిచిపోయి, పాత్రల మేరకు మాత్రమే చూసుకుని, మాస్, కమర్షియల్ ఎలిమెంట్లు పక్కన పెట్టి సరైన సినిమాలు చేస్తే అల్లు శిరీష్ నిలబడతాడు. కానీ ఎందుకో అలా అతగాడు థింక్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. బడ్డీ సినిమా అల్లు శిరీష్ కు కమ్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.
జనం పట్టించుకోరు
ఎలా ఉన్నా థియేటర్లో చూడం