తెలుగు నాట కొంత మంది హీరోలకు మాత్రమే పుల్లింగ్ కెపాసిటీ వుంటుంది. సినిమా ఆ మాత్రం ఈ మాత్రం వుంటే చాలు, లాక్కు పోగల కెపాసిటీ వున్న హీరోలు తెలుగు నాట తక్కువ మంది వుంటారు. సాహో సినిమా టాక్ తో సంబంధం లేకుండా లాక్కు వెళ్లాడు బాహుబలి ఇమేజ్ తో ప్రభాస్.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఆ ఇమేజ్ వుండేది కానీ ఫ్లాపులు ఎక్కువ వచ్చిన తరువాత అది కాస్త తగ్గింది. ఇప్పటికీ పవన్ సినిమా వస్తోంది అంటే ఆ క్రేజ్ వేరు. హడావుడి వేరు. దాదాపు పెద్ద హీరోలు అందరికీ సినిమా ముందు హడావుడి వుంటుంది. కానీ సినిమా మిక్స్ డ్ టాక్ వచ్చినా లాక్కుపోయే కెపాసిటీ కొంత మందికే వుంటుంది.
టాలీవుడ్ లో పవన్ తరువాత పుల్లింగ్ కెపాసిటీని స్వయంగా సాధించుకున్న హీరో బన్నీనే. సినిమా మరీ డిజాస్టర్ అయితే ఏ హీరో అయినా ఏం చేయలేడు. అలా కాకుండా మిక్స్ డ్ టాక్ వచ్చినా చాలు లాక్కు వెళ్లగలిగితే కచ్చితంగా ఆ ముద్ర వుంటుంది.
పుష్ప సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బన్నీ కష్టపడి తన అందాన్ని తాను తీర్చి దిద్దుకున్నాడు. అలా అందంగా కనిపిస్తూ ఇటు అమ్మాయిలకు, అబ్బాయిలకే కాదు, ఫ్యామిలీలకు నచ్చే హీరోగా తయారయ్యాడు. అలాంటి హీరో తొలిసారి పూర్తి రగ్డ్, రఫ్ డీ గ్లామర్ రోల్ లో కనిపించడం ఇబ్బంది అయింది. ఈ విషయం హీరో బన్నీ కూడా ఫీడ్ బ్యాక్ వచ్చింది. తన సన్నిహితులతో కూడా ఇదే మాట చెప్పాడని తెలుస్తోంది. ఇంత డీ గ్లామర్ లుక్ తనకు పనికి రాదనే అభిప్రాయం బన్నీ కూడా వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది
ఇదంతా ఇలా వుంటే తొలి రోజు, మలి రోజు కూడా వీలయినంత స్టడీగానే వసూళ్లు వచ్చాయి. సినిమా చాలా హడావుడి మధ్య విడుదలయింది. ప్రచారం సరిపోలేదన్న టాక్ వుంది. క్లయిమాక్స్ మీద కాస్త నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఇలా రకరకాలుగా కామెంట్లు
కానీ సినిమా చూస్తే ఇప్పటికీ ఇంకా స్టడీగానే నిలబడింది. ఇప్పటికీ ఫుల్స్ వస్తున్నాయి. మంచి కలెక్షన్లు కళ్లపడుతున్నాయి. మొదట్లో నైఙాం ఏదో విధంగా గట్టెక్కుతుంది.జిఎస్టీ ఇస్తారు కదా అనుకున్నారు. కానీ రాను రాను జిఎస్టీ అవసరం లేకుండానే నైజాంలో బ్రేక్ ఈవెన్ అవుతోంది. ఆంధ్ర, సీడెడ్ ల్లో టికెట్ రేట్ల సమస్య వుంది. పైగా చాలా పెద్ద రేట్లకు విక్రయించారు. అది అలా వున్నా, ఆ రేంజ్ కు చేరుతుందా? చేరదా? ఆదిలో ఓ నలబై శాతం పోతుంది అన్న టాక్ వినిపించింది. కానీ రాను రాను స్టడీగా వుండడం, వీకెండ్ ల్లో ఫుల్స్ రావడంతో మెల్లగా దాన్ని దాటి ముందుకు వెళ్లింది.
ఇప్పుడు ఆంధ్ర, సీడెడ్ ల్లో ఓ ధీమా వచ్చింది. న్యూ ఇయర్ కు కూడా ఇదే సినిమా. అందువల్ల ఇరవై శాతం తేడా వస్తుందేమో అనే రేంజ్ కు చేరుకుంది. కేవలం ఆంధ్రలో మాత్రమే సమస్య అయింది. కేరళ, తమిళనాడు, హిందీల్లో బాగానే పాస్ అయిపోయింది. దీంతో ఇప్పుడు నిర్మాతలకు ఓ భరోసా వచ్చింది. ఇదంతా సినిమా క్రెడిట్ మాత్రం కాదు. బన్నీ పుల్లింగ్ కెపాసిటీ కూడా అనుకోవాల్సిందే.
మెగా క్యాంప్ నీడలోంచి బయటకు వచ్చి తన కాళ్ల మీదే ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఆ గోల్ ను చాలా వరకు అచ్యూవ్ చేసినట్లే. పుష్ప సినిమా విడుదలకు ముందు నుంచే పలు సినిమా ఫంక్షన్లకు అతిథిగా వెళ్తూ, సినిమాకు ఓ తెలియని ఊపు తెచ్చాడు. అది ఓపెనింగ్ లో కనిపించింది. ఆ తరువాత స్టడీగా వెళ్తూ బన్నీ క్రౌడ్ పుల్లింగ్ పాయింట్లను నిలబెట్టింది.