బన్నీ నుంచి ఎన్టీఆర్ మీదుగా

ఒక్కో సబ్జెక్ట్ ను ఒక్కో డైరక్టర్ విపరీతంగా ప్రేమిస్తాడు. ఆ సబ్జెక్ట్ ను ఎప్పటికైనా ఎలాగైనా తెరకెక్కించాలనుకుంటాడు. పూరి జగన్నాధ్ లైగర్ సబ్జెక్ట్ ను అలాగే ప్రేమించారు. లైగర్ సబ్జెక్ట్ ను చాలా కాలం…

ఒక్కో సబ్జెక్ట్ ను ఒక్కో డైరక్టర్ విపరీతంగా ప్రేమిస్తాడు. ఆ సబ్జెక్ట్ ను ఎప్పటికైనా ఎలాగైనా తెరకెక్కించాలనుకుంటాడు. పూరి జగన్నాధ్ లైగర్ సబ్జెక్ట్ ను అలాగే ప్రేమించారు. లైగర్ సబ్జెక్ట్ ను చాలా కాలం క్రితం బ్యాంకాక్ లో వుండగా తయారు చేసారు పూరి. 

ఇద్దరమ్మాయిలతో సినిమా జరుగుతున్నపుడు ఈ సబ్జెక్ట్ ను బన్నీకి చెప్పాడు. ఈ సినిమా హిట్ అయితే అప్పుడు అది కూడా చేద్దాం అన్నాడు బన్నీ. కానీ ఇద్దరమ్మాయిలతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.

చాలా కాలం ఎన్టీఆర్ కు అదే సబ్జెక్ట్ ను చెప్పాడు. కానీ ఎన్టీఆర్ ఎందుకో పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదు. దాంతో లైగర్ కథ అలా వుండిపోయింది. ఇప్పుడు అది విజయ్ కు పడింది. 

బన్నీకి..ఎన్టీఆర్ కు చెప్పినపుడు హీరో తో పాటు హీరోయిన్ కూ నత్తి వుంటుంది. కానీ ఇప్పుడు అదే వుంచారో? మార్చారో సినిమా వస్తే కానీ తెలియదు. హీరోకి కోపం వస్తే నత్తి వచ్చి మాట తడబడుతుంది. మామూలు సమయంలో అలా వుండదు.

సినిమాకు అమ్మ నాన్న తమిళ అమ్మాయి ఫ్లావర్ వుంటుంది. హీరోని తల్లే పెంచుతుంది. బాక్సర్ గా తయారు చేస్తుంది. మొత్తం మీద తను అనుకున్న సబ్జెక్ట్ ను తెరమీద చూడాలన్న పూరి కోరిక ఇన్నాళ్లకు తీరింది. అప్పట్లో తీసి వుంటే తెలుగులో మాత్రమే చూడగలిగేవారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా అందిస్తున్నాడు.