బన్నీకి పవన్ కల్యాణ్ బాబాయ్ ఎప్పుడు అయినట్లు?

అల్లు అర్జున్- పవన్ ల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నదని సినీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు.

అల్లు అర్జున్- పవన్ కల్యాణ్ ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం ఉన్నదని రాష్ట్రంలో సినీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు.

ప్రస్తుతం సినీరంగంలోని వాతావరణం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. అల్లు అర్జున్- పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయో లేదో గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ- జనసేన పార్టీల మధ్య విభేదాల స్థాయికి అవి ప్రొజెక్టు అయ్యాయి.

పుష్ప 2 చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ.. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిపించారు. దాని ఫలితం కూడా వసూళ్లపై కనిపించింది.

పుష్ప 2 సినీచరిత్ర ఎరగని రికార్డులు సృష్టిస్తున్నదని మేకర్స్ ఊదరగొట్టుకుంటూ ఉండగా.. ఏపీలో డల్ గా కలెక్షన్లు సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

నిజానికి దీనికి సక్సెస్ మీట్ అని పేరు పెట్టారు గానీ.. ‘అల్లు అర్జున్ బహిరంగ వేదిక మీది నుంచి చెప్పి తీరవలసిన థాంక్స్ మీట్’ ఇది అని అనుకోవాలి.

ఆయన థాంక్స్ చెప్పకపోవడం వల్లనే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారని అంతా అనుకుంటున్న సమయంలో.. నష్టనివారణ కోసం పెట్టిన మీట్ లాగా ఇది సాగింది.

మొత్తానికి అల్లు అర్జున్ తన నోరు తెరచి థాంక్స్ అనే పదాన్ని ఉచ్చరించారు. ముందుగా తెలంగాణ సీఎంకు, సినిమాటోగ్రఫీ మంత్రికి థాంక్స్ చెప్పారు. అలాగే ఏపీ సీఎంకు, సినిమాటోగ్రఫీ మంత్రికి కూడా చెప్పారు.

ఆ ఇద్దరి మధ్యలో ‘స్పెషల్ ప్రైసెస్ రావడానికి ప్రధాన కారణం అయిన ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, సభాముఖంగా థాంక్యూ సోమచ్’ అని చెప్పారు. అభిమానుల హర్షధ్వానాలతో ట్యూన్ అయి.. అదే పదాలను రెండోసారి కూడా ఉచ్ఛరించారు.

ఇంత వరకు బాగానే ఉంది. ‘ఆన్ ఏ పర్సనల్ నోట్’ అంటూ ‘కల్యాణ్ బాబాయ్ థాంక్యూ వెరీ మచ్’ అంటూ మరోసారి పవన్ కు థాంక్స్ చెప్పారు.. అల్లు అర్జున్!

ఈ మాటలే తమాషాగా ధ్వనిస్తున్నాయి. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కు బాబాయి ఎప్పుడు అయ్యారు. ఆయన వరుసకు మామయ్య కదా అవుతారు? అనేది ఇప్పుడు సినీజనులకు కలుగుతున్న సందేహం.

మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బన్నీకి మేనత్త భర్త అంటే మామయ్య! ఆయన తమ్ముడిగా పవన్ కల్యాణ్ కూడా మామయ్యే. మరి గతంలో ఎన్నడూ బన్నీ- పవర్ స్టార్ ను ఉద్దేశించి ‘కల్యాణ్ బాబాయ్’ అని ప్రస్తావించిన సందర్భాలు లేవు.

జనసైనికులు ఏపీలో పుష్ప2 ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో.. నష్ట నివారణ కోసం వరసలు కూడా గుర్తురానంత మొక్కుబడిగా అల్లు అర్జున్ ఈ థాంక్స్ చెప్పారా? అనే అనుమానం కలుగుతోంది.

లేదా, మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలు రాంచరణ్, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు థాంక్స్ చెప్పే పద్ధతిని ఇమిటేట్ చేస్తూ.. ‘కల్యాణ్ బాబాయ్ థాంక్యూ వెరీ మచ్’ అన్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

బన్నీ థాంక్స్ చెప్పడం.. ఏపీలో కలెక్షన్లు పుంజుకునేలా చేస్తుందని బయ్యర్లు ఆశపడడం సంగతేమో గానీ.. ‘బాబాయ్’ అని పవన్ ను పిలిచి.. అల్లు అర్జున్ కొత్త తమాషాకు తెరలేపారని అంతా అనుకుంటున్నారు.

67 Replies to “బన్నీకి పవన్ కల్యాణ్ బాబాయ్ ఎప్పుడు అయినట్లు?”

  1. Maa pedda nani Pillalu inko pedda nanna ni babai ani pilustaru valla ni chusi maaku adi alavatai meme inko pedda nannani babai ani Pilustam.Alage RC ans Susumitha PK ni babai ani pilavatam valla AA Ki kuda Ade alavatai untundi

  2. Orey GA…niku negativity peaks ki velipoyindi..

    whether you know or not..konni families lo from childhood ye varasalu alavaatu aithe, age vachaka kuda continue avutharu..idi common.

    nothing to show that as wrong.. paapam nee kadupu manta ekkuvayipenatundhi as you didn’t expect this..

  3. ఈ సినిమా కి 300 టికెట్ ..

    ఈ రికార్డు కొట్టడానికి వచ్చే సినిమాకి 400 టికెట్.

    మీ పిల్లలకి ఏమీ కొనిపెట్టకండి.. వాళ్ళ దృష్టి లో మీరే హీరో లు అయిపోతారు..

    హీరో లకి బానిసత్వం చెయ్యండి..

  4. As he grew up with Charan and varun, he too calls Pawan babai. This is not the first time. Even varun calls chiru as daddy. Niharika also calls chiru as daddy because they grew up with Charan. These are common and nothing wrong

  5. గ్రేటర్ దెన్ ఆంద్రా అల్లు అర్జున్ చిరంజీవిని కూడా బాబాయే అని అంటాడు. మూవీ జర్నలిస్ట్ అయ్యుండి ఎప్పుడూ విన్లేదా , కామన్ పీపుల్ అయిన మాకు తెలుస్తుంది, మూవీ జర్నలిస్ట్ అయిన నీకు తెలుస్తలేదు, నీకు జీతం బొక్క

  6. బన్నీ ఫ్యాన్స్ ని వైసిపికి అనుకూలంగా మార్చుకోవడానికి బాగానే బరితెగించావ్ గ్రేటర్ దెన్ ఆంద్రా

  7. Cry cry…..until…….సొంత కుటుంబ సభ్యులను అనవసరం గా దూరం చేసుకోవడం వల్ల వచ్చే నష్టం తెలిసింది ఏమో GA….😂😂😂SO మీ కడుపుమంట ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు కదా GA…..😂😂

  8. ఈ సినిమా కి 300 టికెట్ ..

    ఈ రికార్డు కొట్టడానికి వచ్చే సినిమాకి 400 టికెట్.

    మీ పిల్లలకి ఏమీ కొనిపెట్టకండి.. వాళ్ళ దృష్టి లో మీరే హీరో లు అయిపోతారు..

    హీరో లకి బానిసత్వం చెయ్యండి..

  9. Baba… I heard many times in previous interview or on stages he called పవన్ గారు as బాబాయ్ ఓన్లీ. అదొక అలవాటు గా మారుతోంది. మన కజిన్స్ పిలిచే విధానాన్ని బట్టి. నేను మా పిన్నిని అక్క అని పిలుస్తాను. నా చిన్నతనం లో పక్కన వాళ్ళు పిలిచే విధానాన్ని బట్టి. Now I am in 40s. ఇప్పటికీ మా పిన్నిని అక్క అని పిలుస్తాను.

  10. గాలివాన లో , వాననీటి లో Paytm ప్రయాణం…..తీరమెక్కడో తెలియదు పాపం….😂😂😂….అయ్యో GA….

  11. గాలివాన లో వాననీటి లో paytms ప్రయాణం….తిరమెక్కడో తెలియదు పాపం….

  12. గాలివాన లో ,వాననీటి లో paytms ప్రయాణం….. తీరామెక్కడొ తెలియదు పాపం…..😂😂😂

  13. అల్లు అర్జున్ గతంలో ఒక సారి చెప్పాడు – తను చిన్నపటినుండీ పవన్‌ని బాబాయి అని పిలిస్తాడట. చిన్నపుడు సుష్మిత, చరణ్‌తో కలిసి అలా పిలవడం అలవాటు అయ్యిందట.

  14. బాబాయ్ అని అనడాన్ని బట్టి వ్యంగ్యంగా నే అని ఉండొచ్చు! మామయ్య అని కాకుండా!

  15. పుష్ప-2 అని తెగ రాసి లెపితె, వాడు కూడా బాబాయి అని పెళ్ళిపొతున్నాడా! అయ్యొ నీ కస్టం పగ వాడికి కూడా వద్దు

  16. జెగ్గులుగాడు సంధ్య లో రేవతిని లేపేసి తన మార్క్ శవ రాజకీయం స్టార్ట్ చేసిన తర్వాత, పవన్ తన బాబాయ్ అయ్యాడు, గుర్తొచ్చాడు..కదరా నీలి బన్నీ??

  17. ఇదేంటబ్బా నిన్ననే విజ్జి akka కనపడడు కానీ బన్నీ అంత ఇంత అని హైలెట్ చేస్తే ఇవ్వాళా కలెక్షన్స్ కోసం థాంక్స్ చెప్పేసాడు…. అన్న నమ్మినోళ్లేమో అన్న కి మీరు నమ్మినోళ్లేమో మిమ్మల్ని గుండు కొడుతుంటే.. మిమ్మల్ని నమ్ముకుని కింద పోస్ట్లు పెట్టె వాళ్లేమో గుండెలు బాదుకుంటున్నారు…..

  18. ఇది కూడా షె కా వ త్ కి సా రీ చెప్పడం లాంటిదే.. ఆయన కళ్యాణ్ అనే బాబాయ్ కి చెప్పారు.. పవర్ స్టార్ మావయ్య కు కాదు అనుకుంట..

    బాబాయ్ ట్రెండింగ్ వర్డ్ అయిపొయింది… సహవాస దోషం..

    ఓమ్ శాంతి శాంతి శాంతి

  19. బాబాయ్ అని పిలవడం చిన్నప్పటినుండి అలవాటు.. ఆ విషయం చాలా సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు

  20. మీరు మామూలు వాళ్ళు కాదురా బాబు… చిరంజీవిని చిక్కు బాబాయ్ అంటాడు అల్లు అర్జున్. నాగబాబుని, పవన్ కళ్యాణ్ ని కూడా బాబాయ్ అనే చిన్నప్పటి నుంచి పిలుస్తామని కొన్ని సార్లు చెప్పాడు వాడే. కానీ మీకు ఇవి తెలీదు. తెలుసుకోరు. ఇలా ఆర్టికల్స్ మాత్రం రాసేస్తారు. గ్రేట్ ఆంధ్రా టీమ్ ఎలర్ట్ గా ఉండాలి కదా..

Comments are closed.