AAAలో బన్నీ గ్యాలరీ.. ‘ఆర్మీ’కి పండగ

ఏఎంబీలో మహేష్ బాబు గ్యాలరీ పెట్టినట్టుగానే, ఏఏఏలో బన్నీ గ్యాలరీ పెట్టారు. దానికి అల్లు అర్జున్ ఐకాన్ గ్యాలరీ అని పేరు పెట్టారు. ఈ గ్యాలరీ అల్లు అర్జున్ ఆర్మీకి తెగ నచ్చుతుంది. అందులో…

ఏఎంబీలో మహేష్ బాబు గ్యాలరీ పెట్టినట్టుగానే, ఏఏఏలో బన్నీ గ్యాలరీ పెట్టారు. దానికి అల్లు అర్జున్ ఐకాన్ గ్యాలరీ అని పేరు పెట్టారు. ఈ గ్యాలరీ అల్లు అర్జున్ ఆర్మీకి తెగ నచ్చుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

సువిశాలమైన ఈ గ్యాలరీలో బన్నీ సాధించిన అవార్డుల్లో కొన్ని ముఖ్యమైనవాటిని ఓవైపు ఉంచారు. దాని చుట్టూ అల్లు అర్జున్ సిగ్నేచర్ ను కూడా పొందుపరిచారు. మరోవైపు అల్లు అర్జున్ నటించిన సినిమాల పోస్టర్లతో ఫొటో ఫ్రేమ్స్ పెట్టారు. వాటికి మరింత అందం చేకూర్చేలా ఫోకస్ లైట్లు అమర్చారు.

ఇంకోవైపు గోడకు వర్కింగ్ స్టిల్స్ కూడా పెట్టారు. రాఘవేంద్రరావు, సుకుమార్, త్రివిక్రమ్, గుణశేఖర్ లాంటి దర్శకులతో కలిసి వర్క్ చేసినప్పుడు తీసిన ఫొటోల్ని అక్కడ ఉంచారు.

ఇక ఫ్యాన్స్ కు బాగా నచ్చే మరో వాల్ ఉంది. దానిపై బన్నీ స్పెషల్ ఫొటో గ్యాలరీ ఉంచారు. నిజజీవితంలో బన్నీ దిగిన ఫొటోలు అక్కడున్నాయి. భార్య, అన్న, తమ్ముడు, తండ్రి.. ఇలా తన కుటుంబ సభ్యులతో దిగిన స్టిల్స్ ఉంచారు. ప్రత్యేకంగా బన్నీ సెలక్ట్ చేసిన పిక్స్ ఇవి.

పూర్తిగా తన కుటుంబానికి మాత్రమే ఈ వాల్ ను పరిమితం చేశాడు బన్నీ. చిరంజీవి, చరణ్, సాయితేజ్ తో దిగిన ఫొటోల్ని ఇక్కడ పెట్టలేదు. ఓవరాల్ గా, AAA సినిమాస్ లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు, బన్నీ ఐకానిక్ గ్యాలరీ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. మరికొద్దిసేపట్లో ఈ మాల్ ను ఓపెన్ చేయబోతున్నారు. ఆదిపురుష్ రిలీజ్ తో, రేపట్నుంచి ఈ సినిమాలో స్క్రీన్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయి.

Click Here For Photo Gallery