తెగించిన తమన్నా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

తమన్న.. ఈ పేరు చెప్పగానే సౌత్ ఆడియన్స్ కు ముగ్దమనోహరమైన రూపు, ఓ అందమైన నవ్వు గుర్తొస్తాయి. హద్దులు దాటని స్కిన్ షో కూడా గుర్తొస్తుంది. కెరీర్ లో ఎప్పుడూ ఆమె గ్లామర్ షో…

తమన్న.. ఈ పేరు చెప్పగానే సౌత్ ఆడియన్స్ కు ముగ్దమనోహరమైన రూపు, ఓ అందమైన నవ్వు గుర్తొస్తాయి. హద్దులు దాటని స్కిన్ షో కూడా గుర్తొస్తుంది. కెరీర్ లో ఎప్పుడూ ఆమె గ్లామర్ షో చేయలేదు. అంతేకాదు, కనీసం లిప్ కిస్ కూడా పెట్టలేదు. అలాంటి వ్యవహారాలకు తను దూరం అంటూ చాలాసార్లు ప్రకటించింది కూడా.

అలా పద్ధతిగా ఉన్న తమన్న హద్దులు దాటింది. దీనికి కారణం తాజాగా రిలీజైన ఓ వెబ్ సిరీస్. రాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో తమన్న రెచ్చిపోయింది. లిప్ కిస్సుల సంగతి దేవుడెరుగు, ఏకంగా టాప్ లెస్ గా ఓ శృంగార సన్నివేశంలో నటించేసింది.

ఆ సీన్ చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. తమన్నానే ఈ పని చేసిందా అంటూ ఒకటికి రెండుసార్లు కళ్లప్పగించి చూశారు. నిజమే.. అది తమన్నా పనే.

ఇప్పటికే ఓటీటీలో కొంతమంది భామలు హాట్ హాట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పుడా లిస్ట్ లోకి తమన్న చేరిపోయింది. తను ఈ కథను, పాత్రను చాలా బాగా అర్థం చేసుకొని నటించానని, అందులో ఆత్మ తనకు బాగా నచ్చిందంటూ, ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో చెప్పుకొచ్చింది తమన్న. దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు నెటిజన్లకు తెలిసొచ్చింది. ఆమె హాట్ సీన్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

రీసెంట్ గా తన లవ్ లైఫ్ మేటర్ బయటపెట్టింది తమన్న. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది. అలా హాట్ టాపిక్ గా మారిన మిల్కీబ్యూటీ, ఇప్పుడీ వెబ్ సిరీస్ తో మరోసారి హెడ్ లైన్స్ కెక్కింది. తమన్న ఎందుకు ఇంతలా మారిపోయింది, ఆమెకు అంత అవసరం ఏమొచ్చిందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. ప్రస్తుతం ఈమె చిరంజీవి సరసన భోళాశంకర్ సినిమా చేస్తోంది.