Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

బన్నీ తగ్గేదేలే...ట్రైల‌ర్ ఆలస్యం

బన్నీ తగ్గేదేలే...ట్రైల‌ర్ ఆలస్యం

నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో స్టయిలిష్ స్టార్ బన్నీ ఫ్యాన్స్ మామూలుగా రంకెలు వేయలేదు. ట్వీట్ లు, వీడియో లు ఒకటి కాదు హంగామా. ఇదంతా అనుకున్న టైమ్ కు ట్రైల‌ర్ విడుదల కాలేదు. 

నిజానికి ఏ ట్రైల‌ర్ టైమ్ కు విడుదల కాకున్నా నిర్మాతలు చేసేదేమీ వుండదు. డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్, హీరో, టెక్నికల్ వర్క ఇవే కారణం అవుతాయి. నిర్మాత చేతులు కట్టుకుని కూర్చోవడం తప్ప చేయగలిగింది, చేసేదీ ఏమీ వుండదు.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, పుష్ప ట్రైల‌ర్ ను ముందుగా 2.20 నిమషాల లెంగ్త్ లో కట్ చేసారు. హీరో అప్రూవల్ కు పంపించారు. పెద్ద హీరోలు అయితే అంతే. అదే చిన్న హీరోలు అయితే నిర్మాతలు ఆడేసుకుంటారు. చూపించాలనే ఆలోచన కూడా వుండదు. సరే, ఆ సంగతి అలా వుంచితే ట్రైల‌ర్ చూసిన హీరో బన్నీ తనకు సినిమా మీద ఐడియా వుంది కనుక కొన్ని షాట్ లు చెప్పి, యాడ్ చేయమని కోరినట్లు తెలుస్తోంది.

నిజానికి అది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ అలా చెప్పిన షాట్ ల సిజి వర్క్ పూర్తి కావాలి కదా? అక్కడ వచ్చింది సమస్య. ఒక రోజు వాయిదా వేద్దాం అంటే అప్పటికే డేట్, టైమ్ తో ప్రకటనలు ఇచ్చేసారు. దాంతో ఇక ఉరకలు..పరుగులు..టెన్షన్..ఈ లోగా ఫ్యాన్స్ తిట్లు, రంకెలు. 

మొత్తానికి విడుదల చేసారు. జనం బాగుందంటున్నారు. నిర్మాతలు హ్యపీ అయ్యారు. ఓ పెద్ద సినిమా ట్రైల‌ర్ వెనుక ఇంత వుంటుంది. వ్యవహారం మామూలుగా వుండదు. అందులో అందులోనూ హీరో తగ్గేదేలే అంటే ఇంకా మామూలుగా వుండదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?