నష్టనివారణ చర్యలకు దిగిన బన్నీ

ఓవైపు సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంటే.. మరోవైపు కూతురుతో దిగిన ఫన్నీ వీడియోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ. ఇంకోసారి సైరా సినిమాకు సంబంధించి సెకెండ్ ట్రయిలర్, సాంగ్ రిలీజ్ హంగామాలో…

ఓవైపు సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంటే.. మరోవైపు కూతురుతో దిగిన ఫన్నీ వీడియోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ. ఇంకోసారి సైరా సినిమాకు సంబంధించి సెకెండ్ ట్రయిలర్, సాంగ్ రిలీజ్ హంగామాలో నడుస్తుంటే.. మరోవైపు సామజవరగమన అంటూ తన కొత్త సినిమా సాంగ్ రిలీజ్ చేశాడు బన్నీ. ఇలా చిరంజీవి సినిమాను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న బన్నీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు మెగాభిమానులు.

చిరంజీవికి దూరంగా ఉండేందుకు బన్నీ ప్రయత్నిస్తున్నాడని, మెగా నీడపడకుండా ఇండిపెండెంట్ స్టార్ గా ఎదిగేందుకు ట్రై చేస్తున్నాడంటూ ఇప్పటికే కథనాలు వస్తున్న నేపథ్యంలో.. మెగాఫ్యాన్స్ పూర్తిగా బన్నీని పక్కనపెట్టారు. చివరికి బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా సాయిధరమ్ తేజ్ ఫ్లెక్సీ పెట్టారు కానీ బన్నీ పోస్టర్ మాత్రం పెట్టలేదు అభిమానులు.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా బన్నీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. సంక్రాంతికి రెడీ అవుతున్న సినిమా ప్రమోషన్ ను సైరా రిలీజ్ తర్వాత పెట్టుకుంటే బాగుండేది కదా, సరిగ్గా సైరా రిలీజ్ కు కొన్నిరోజుల ముందు బన్నీ ఇలా తన సినిమా ప్రచారాన్ని ప్రారంభించడం ఏంటంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. సొంత కాంపౌండ్ కు చెందిన హీరోనే ఇలా వ్యవహరిస్తే, బాలయ్య-మహేష్ లాంటి మిగతా హీరోలు చిరంజీవి సినిమాకు పోటీగా మరింత స్టఫ్ రిలీజ్ చేసే ప్రమాదం ఉందనేది వాళ్ల భయం.

ఈ ట్రోలింగులు, అభ్యర్థనలు, హెచ్చరికలు అన్నీ బన్నీకి చేరినట్టున్నాయి. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడేమో.. సైరా రిలీజ్ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టాడు బన్నీ. చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానముందో అందులో రాసుకొస్తూనే, సైరా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మగధీరలో రామ్ చరణ్ ను చూసినప్పుడే, చిరంజీవి అలాంటి గ్రాండ్ ఎపిక్ సినిమాలో కనిపిస్తే బాగుంటుందని కోరుకున్నానని, తన కోరిక సైరాతో తీరబోతోందంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

బన్నీ పెట్టిన పోస్ట్ బాగుంది కానీ ఇప్పటికే ఆలస్యమైంది. మెగాభిమానుల దృష్టిలో ఎంత బ్యాడ్ అవ్వాలో అంతా అయ్యాడు అల్లు అర్జున్. గతంలో “చెప్పను బ్రదర్” అంటూ పవన్ అభిమానులకు దూరమైన బన్నీ.. ఆ తర్వాత ఫిలింఛాంబర్ లో పవన్ ను కౌగిలించుకొని ఫ్యాన్స్ ను కొంత కూల్ చేశాడు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ను కూడా కూల్ చేయాలంటే, బన్నీకి అలాంటి మేజిక్ మూమెంట్ దొరకాల్సిందే. ఇలాంటి ట్విట్టర్ పోస్టులు ఎన్ని పెట్టినా ఫ్యాన్స్ శాంతించరు.

హీరో ఫోన్ చేయగానే సెకండ్లలో వచ్చిన డైరెక్టర్..?