చిదంబరానికి దక్కని ఊరట..!

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పి.చిదంబరానికి మరోసారి కోర్టు మొండిచేయి చూపింది. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. చిదంబరాన్ని ఈ దశలో బయటకు వదిలితే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని…

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పి.చిదంబరానికి మరోసారి కోర్టు మొండిచేయి చూపింది. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. చిదంబరాన్ని ఈ దశలో బయటకు వదిలితే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించింది సీబీఐ. ఆ వాదన మేరకు ఆయనకు బెయిల్ నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. ఈ కాంగ్రెస్ నేత ఇప్పటికే కొన్నిరోజుల నుంచి తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

తను కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన జైల్లోనే ఇప్పుడు చిదంబరం ఉన్నారు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత పవర్ ఫుల్ నేతగా, కాంగ్రెస్ పార్టీ విరోధులను జైలుకు పంపిన ఘనుడుగా పేరుంది చిదంబరానికి. ఇప్పుడు ఆయనే జైల్లో ఉన్నారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ కోసం శతథా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. అయితే సీబీఐ, ఈడీలు మాత్రం ఆయనను బయటకు వదలకూడదని వాదిస్తూ ఉన్నాయి. వాటి వాదన పట్ల కోర్టు కూడా మొగ్గుచూపింది. చిదంబరానికి మరోసారి బెయిల్ నిరాకరించింది.

చిదంబరం అరెస్టు పట్ల కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే చిదంబరాన్ని ఇప్పుడప్పుడే బయటకు వదిలేలా లేరని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

హీరో ఫోన్ చేయగానే సెకండ్లలో వచ్చిన డైరెక్టర్..?