బన్నీ – ట్రోలింగే.. ట్రోలింగ్!

సునామీ వచ్చినపుడు మర్రి మానులు సైతం గాల్లోకి ఎగిరిపోతాయి. అలాగే ఎగిరిపోయారు మహామహులంతా ఆంధ్ర ఎన్నికల్లో. కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లు వైకాపా ఓడడం అందులోనూ నంద్యాలలో ఓడడం, హీరో…

సునామీ వచ్చినపుడు మర్రి మానులు సైతం గాల్లోకి ఎగిరిపోతాయి. అలాగే ఎగిరిపోయారు మహామహులంతా ఆంధ్ర ఎన్నికల్లో. కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లు వైకాపా ఓడడం అందులోనూ నంద్యాలలో ఓడడం, హీరో బన్నీ మీదకు వచ్చింది. సోషల్ మీడియాలో మామూలుగా ఏకడం లేదు. ఒకరు కాదు అంతా.

అటు వివిధ హీరోల ఫ్యాన్స్, అన్నింటికి మించి మెగా ఫ్యాన్స్, కూటమి ఫ్యాన్స్ అంతా బన్నీ ని ఎద్దేవా చేస్తున్నారు. జనసేన జనాలు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ప్రభాస్ మద్దతు ఇచ్చిన వారు గెలిచారు. చరణ్ మద్దతు ఇచ్చిన జనసేన గెలిచింది. బన్నీ మద్దతు ఇచ్చిన కేండిడేట్ ఓడారు అంటూ యాగీ చేస్తున్నారు.

ఈ సంగతి ఎలా వున్నా, మెగా సంబరాల్లో బన్నీ పార్ట్ కాలేకపోయారు. 21 స్థానాలకు 21 స్ధానాలు గెలుచుకోవడం, కింగ్ మేకర్ హోదాకు చేరడం, ఆంధ్ర రాజకీయాలు మలుపు తిప్పిన వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం, అన్నింటికి మించి అన్న మెగాస్టార్ చేయలేనిది చేసి చూపించడం ఇలా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ కీర్తి తెచ్చుకున్నారు. దీనికి మెగా ఫ్యామిలీ అంతా సంబరపడుతోంది. కానీ పాపం, బన్నీ మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయారు.