బుట్టబొమ్మ…అందంగా వుంది

కోవిడ్ టైమ్ లో మలయాళంలో విడుదలై మంచి ప్రశంసలు పొందిన సినిమా కప్పెల. ఈ చిన్న సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు సితార నాగవంశీ. బుట్టబొమ్మ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా…

కోవిడ్ టైమ్ లో మలయాళంలో విడుదలై మంచి ప్రశంసలు పొందిన సినిమా కప్పెల. ఈ చిన్న సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు సితార నాగవంశీ. బుట్టబొమ్మ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. 

ఓ అమాయకపు పల్లెటూరు అమ్మాయి…పట్నం పిల్లాడి స్నేహంలో పడిన వైనం ఈ సినిమా కథ. స్వచ్ఛమైన, ఫ్రెష్ లవ్ స్టోరీ ఫీల్ వుంటుంది సినిమాలో. అనిక సురేంద్రన్ (విశ్వాసం ఫేమ్) ఈ సినిమాలో కథానాయిక. అర్జున్ దాస్ హీరో. సినిమాలో మరో హీరో క్యారెక్టర్ కూడా వుంది.

ఈ చిన్న సినిమాను ఓటిటి కోసం నిర్మించారు. కానీ సినిమా చూసిన తరువాత, ఆ లోకేషన్లు, గ్రాండియర్ చూసాక థియేటర్ కే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా భాగస్వామి. షౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విశాఖ, అరకు తదితర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.